మనిషికి ఎంతో విశ్వాసకరమైన తోడు ఏదంటే ఠక్కున డాగ్ అని చెబుతారు. అది జాతి కుక్కైనా, వీధికుక్కైనా సరే కాసింత అన్నం పెట్టి గోరంత ప్రేమ చూపిస్తే.. కొండంత విశ్వాసంతో ఉంటుంది. తన చివరిశ్వాస వరకు ప్రేమను చాటుకుంటుంది. అలాంటి ఓ కుక్క చనిపోతే ఆ కాలనీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టర్లు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.