Vijayendra Prasad: ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను అనూహ్యంగా రాజ్యసభకు నామినేట్ చేయడం చర్చనీయంగా మారింది. ఈ తరుణంలో ఆయన మహాత్మా గాంధీ- జవహర్ లాల్ నెహ్రూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను నటి కంగనా షేర్ చేయడం గమనార్హం.
Vijayendra Prasad: ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు అనూహ్యంగా రాజ్యసభ సీటు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయనకు ఎందుకు రాజ్యసభ సీటు ప్రకటించారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో ఆయన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలు సీని ప్రముఖలు షేర్ చేయడం గమనార్హం. ఇంతటీ.. ఆ వీడియోలో ఏముంది? ఆయన వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో? తెలుసుకుందాం..
ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్ మరియు అలియా భట్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం RRR. ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న విడుదలై.. బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
ఈ చిత్రం చివరి పాటలో దేశంలోని గొప్ప స్వాతంత్య్ర పోరాటయోధులకు నివాళులు అర్పించారు. ఈ పాటలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నుండి రాణి లక్ష్మీబాయి వరకు ఎందరో మహానీయులను చూపిస్తారు. కానీ, దేశ 'జాతిపిత' మహాత్మా గాంధీ, అలాగే దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూలను చూపించలేదు.
ఈ విషయాన్ని పలువురు ప్రేక్షకులు గమనించారు. దీనిపై ప్రశ్నలు కూడా లేవనెత్తారు, అయితే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో ఈ విషయంపై విజయేంద్ర ప్రసాద్ స్వయంగా సమాధానం ఇస్తున్నట్లు కనిపిస్తుంది.
RRR చిత్రంలోని చివరి పాటలో గాంధీ, నెహ్రూలకు కాకుండా ప్రత్యేకంగా పటేల్ జీకి నివాళులర్పించడంపై విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'బ్రిటిషర్లు భారతదేశానికి స్వాతంత్య్ర ప్రకటించే సమయంలో.. మన దేశంలో 17 పిసిసి (స్టేట్ కాంగ్రెస్ కమిటీ) ఉండేవి. అయితే.. గాంధీజీ స్వాత్రంత్య ఉద్యమానికి అధిపతి. కావున బ్రిటీష్ వారు.. గాంధీజీని పిలిచి.. దేశ ప్రధానమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుండి ఒక ప్రముఖ వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు. వారి ఆదేశాల మేరకు గాంధీజీ.. 17 పిసిసి అధ్యక్షులను పిలిచి.. ఒకరిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు. అందులో పటేల్ జీ 15 మంది ఓట్లు వేయగా.. కృపలానీకి ఒకరూ మద్దతు తెల్పగా.. మరొకరు ఎవరికి ఓటు వేయకుండా విడిచిపెట్టారు. ఆ సమయంలో గాంధీజీ.. పటేల్‌ను ప్రధానిగా నియమించకుండా.. నెహ్రూ వైపు మొగ్గు చూపారు. పైగా.. ప్రధాని కావాలంటే ఖాదీ ధరిస్తే.. సరిపోదు, చదువు అవసరం, విదేశీయులతో మాట్లాడాలి, కాబట్టి నా ఎంపిక నెహ్రూ' అని గాంధీ అన్నారు. గాంధీకి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే.. పటేల్ జీని ప్రధాని చేసేవారని అన్నారు.
ఈ ఘటనతో.. గాంధీ జీవించి ఉన్నంత వరకు తాను ప్రధానమంత్రి పదవికి ఆశపడనని పటేల్‌కు చెప్పారని అన్నారు. పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే.. కశ్మీర్ ఇలా తగలబడి ఉండేది కాదు. పటేల్ తన ధైర్య సహాయాలతో దేశంలోని 561 సంస్థానాలను భారత యూనియన్ లో వీలినం చేశారు. కానీ, కాశ్మీర్ విషయంలో నెహ్రూ జోక్యం చేసుకోవడంతో .. ఆ సమస్య నేటీకి పరిష్కరం కాలేదనీ, నిత్యం దాడులతో రావణకాష్టలా మారిందని, ఇప్పుడు కశ్మీర్‌ను చూస్తే మండిపోతుందన్నారు. ఈ వీడియోను కంగనా రనౌత్ కూడా షేర్ చేసింది
కెవి విజయేంద్ర ప్రసాద్ సౌత్ చిత్రాల ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి మరియు అతను అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథను వ్రాసాడు. కెవి విజయేంద్ర ప్రసాద్ RRR, 'బాహుబలి: ది బిగినింగ్, 'బాహుబలి: ది కన్‌క్లూజన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలకు కథ అందించారు. ఆయన తెలుగులోనే కాకుండా.. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక', 'తలైవి' చిత్రాలకు కథలు రాశారు. అక్షయ్ కుమార్ నటించిన 'రౌడీ రాథోడ్'తో పాటు పలు చిత్రాలకు కథను రాశారు. ఆయన ప్రస్తుతం 'బజరంగీ భాయిజాన్, 'రౌడీ రాథోడ్' సీక్వెల్స్ కోసం పని చేస్తున్నాడు. దీనితో పాటు.. కంగనా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సీత: ది ఇన్కార్నేషన్ అనే సినిమాకు ఆయననే కథ అందిస్తున్నారు. ఇదే తరుణంలో.. నిజాం కాలంలో తెలంగాణ జరిగిన దారుణాలపై, కాశీం రజ్వీ అరాచకాలపై కథను తయారు చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.
విజయేంద్ర ప్రసాద్ ను నామినేట్ చేయడానికి అదే ప్రధాన కారణం
స్టార్ రైటర్ కెవి విజయేంద్ర ప్రసాద్ అనూహ్యంగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తరఫున చాలామంది ఆశావహులు ఉన్నా.. అలాగే సమాజ సేవలో ఆయనకు మించిన వారు ఉన్నా.. విజయేంద్ర ప్రసాద్ ను ఎంపికపై ఎంతో తెలియని విషయమే ఉందని ప్రచారం జరుగుతోంది.
విజయేంద్ర ప్రసాద్.. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి.. ఈ విషయాన్ని అనేక ఇంటర్వ్యూలలో బాహాటంగానే ఒప్పుకున్నారు. అలాగే.. ఆయన హైదరాబాద్ కేంద్రంగా రజాకార్లు జరిపిన దారుణాలపై ఒక సినిమా చేయబోతున్నారని, ఆ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశం కూడా ఉందని టాక్ అలాగే.. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపకుడు హెగ్డేవార్ బయోపిక్ రూపొందించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇవే ఆయన ఎంపికకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.
