చోరీకి వాడిన రాడ్ కోసం నీళ్లు తోడితే.. పోయిన బంగారం దొరికింది.. తమిళనాడులో విచిత్రం..

మంగళవారం నుంచి వర్షపు బావిలో ఉన్న నీటిని తోడే పనులు చేపట్టారు. గురువారం ఉదయం వరకు మొత్తం నీటిని తోడేయగా..  బావిలో ప్లాస్టిక్ కవర్ లో పోయిన 687 సవర్ల నగలు ఉండడం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇనుప రాడ్ దొరుకుతుందని గాలించిన వారికి పోయిన నగలే దొరకడం ఆసక్తికరంగా మారింది. 

stolen gold found in a abandoned well in tamilnadu

తమిళనాడు :  tamilnaduలో ఓ వ్యక్తి ఇంట్లో సోమవారం 687 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన policeలు చోరీ చేసేందుకు తలుపులు పగలగొట్టిన iron rad ఉపయోగించినట్లు నిర్ధారించారు. ఇనుప రాడ్ ను దొంగలు  wellలో పడేసి ఉండవచ్చని అది దొరికితే విచారణ సులభమవుతుందని.. పోలీసులు దాని కోసం గాలించమని బాధితులకు సలహా ఇచ్చారు.  దీంతో ఇనుప రాడ్  కోసం గాలించిన  బాధితులకు పోయిన బంగారు నగలు బావిలో లభించడం ఆశ్చర్యకరంగా మారింది. 

వివరాల్లోకి వెడితే.. గోపాల పట్టినం  నడువీధిలో  జగుబర్ సాదిక్ (55) అనే పారిశ్రామికవేత్తకు చెందిన విలాసవంతమైన నివాసగృహం ఉంది. సాదిక్ బ్రూనేలో సూపర్ మార్కెట్లు నడుపుతున్నాడు. తరచూ స్వస్థలానికి వచ్చి ఆ ఇంట్లో ఉండి వెడుతూ ఉండేవాడు. గత ఏడాది నుంచి కరోనా లాక్డౌన్ కారణంగా ఆయన స్వస్థలానికి రాలేదు. ఆయన సోదరి కుటుంబీకులు నివాస గృహాన్ని తరచూ శుభ్రం చేసి  తాళం వేసేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీ రాత్రి వ్యక్తులు 687 సవర్ల నగలు దోచుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం సాదిక్ సోదరి కుమార్తె ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. 

పాలనపై మోదీకి మంచి పట్టు ఉంది.. అది సాధ్యం కాదని మోదీకే నేరుగా చెప్పాను: శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిచ్చిన సలహాతో పోయిన నగలు దొరకడంతో వారు ఆనందంలో మునిగిపోయారు. పుదుక్కోటై  జిల్లా గోపాలపట్నం గ్రామంలో  జవహర్ అనే వ్యక్తి ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఇంటి వెనక తలుపులు పగలగొట్టి మేడపై స్టోర్ రూమ్ లో ఉంచిన 687 సవర్ల నగలు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

మంగళవారం డి ఐ జి నేరుగా చోరీకి గురైన గోపాలపట్నంలోని బాధితుని ఇంటికి వెళ్లి పరిశీలించారు.  జవహర్ సాదిక్  బంధువులు, ఇరుగుపొరుగు ఇళ్ల వద్ద విచారణ నిర్వహించారు. సాదిక్ ఇంటి వెనక తలుపులు తెరిచేందుకు ఉపయోగించిన వెనకవైపు ఉన్న పాడుపడిన బావిలో పడేసి ఉండవచ్చని బంధువులకు సూచించారు. దానిని వెంటనే వెతికి కనిపెడితే విచారణ మరింత సులభం అవుతుందని తెలిపారు.

కడుపులో దాచి కొకైన్ స్మగ్లింగ్.. బయటపడ్డ 91 క్యాప్సూల్స్ , ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న కస్టమ్స్

దీంతో వారు మంగళవారం నుంచి వర్షపు బావిలో ఉన్న నీటిని తోడే పనులు చేపట్టారు. గురువారం ఉదయం వరకు మొత్తం నీటిని తోడేయగా..  బావిలో ప్లాస్టిక్ కవర్ లో పోయిన 687 సవర్ల నగలు ఉండడం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇనుప రాడ్ దొరుకుతుందని గాలించిన వారికి పోయిన నగలే దొరకడం ఆసక్తికరంగా మారింది.  అయితే విలువైన నగలు దొంగతనం చేసిన వారు ఎందుకు బావిలో పడేసి ఉంటారు? ఎవరు చేసి ఉంటారు? అన్న అంశాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios