Asianet News TeluguAsianet News Telugu

కరోనా మృతులకు రూ.50 వేల నష్టపరిహారం.. కేంద్రం కీలక నిర్ణయం

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారమే.. కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనుంది కేంద్రం. 
 
States To Provide 50,000 Compensation For Each Covid Death says Centre
Author
New Delhi, First Published Sep 22, 2021, 6:34 PM IST

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారమే.. కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనుంది కేంద్రం. 

ఈ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇందుకు కావాల్సిన నిధులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ నుంచి తీసుకోవచ్చని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలియజేసింది. జిల్లా స్థాయిలో ఈ నష్టపరిహారానికి సంబంధించి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ లేదంటే జిల్లా పాలనా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని తెలిపింది. 

కాగా, 2020 జనవరిలో దేశంలో కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి భారత్‌లో 4.45 లక్షల మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. నష్టపరిహారం అందుకోవాలంటే కరోనా వల్ల చనిపోయినట్లుగా సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం పొంది వుండాలని సూచించింది. జిల్లా అధికార యంత్రాంగం దరఖాస్తులను పరిశీలించిన మీదట 30 రోజుల్లోగా బాధితుల ఖాతాలో నేరుగా పరిహారం జమ చేస్తామని వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios