కోడలి జీవితాన్ని మార్చిన అత్త డైరీ.. నెలకు రూ. 5 లక్షల సంపాదన..
పనిచేయాలనే తపన ఉండాలే గాని.. చిన్న కాగితం ముక్క కూడా వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే.. అత్తగారి డైరీ ఓ కోడలిని నెలకు 5 లక్షల రూపాలు సంపాదించేలా చేసింది. ఇంతకీ అందులో ఏం ఉందంటే?
సాధారణం అత్తా కోడళ్లకు అస్సలు పడదు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ ఉంటారు. ఇలాంటివి మనం మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటారు. కానీ ఓ అత్త మాత్రం తన కోడలిని ఎంతో అపురూపంగా చూసుకునేది. వీరు ఎంతో ప్రేమగా ఉండేవారు. కాగా కొన్నాళ్లకు ఆ అత్త చనిపోయింది.. అయితే ఆమె జ్ఞాపకంగా ఓ కోడలు వ్యాపారం చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.
సోనమ్ సురానా, టీఎస్ అజయ్ భార్యాభర్తలు. వీరు తమ తల్లి పేరు మీద ప్రేమ్ ఈటాసీ అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ వినియోగదారులకు మంచి రుచికరమైన హోం మేడ్ ఆహారాన్నిఅందిస్తోంది. 2020 నవంబర్ లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు 1500 మందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. సోనమ్, అజయ్ తమ తల్లి చేసిన రుచికరమైన వంటకాల జ్ఞాపకాల స్ఫూర్తితో ఈ సంస్థను ప్రారంభించారు.
అయితే అజయ్ తల్లి ప్రేమలత చాలా టేస్టీ టేస్టీ ఫుడ్స్ ను వండేది. ఆమె వంటకు ఇంటిళ్లిపాది ఫిదా అయ్యేవారు. చట్నీ, మసాలా పొడి, ఊరగాయ వంటి కూరలను ఈమె ఎంతో టేస్టీగా చేసేదట. కాగా ఈమె 20217 జూలై లో ఆమె అకస్మత్తుగా కన్నుమూసారు. దీంతో వారెంతో క్రుంగిపోయారు.
ప్రేమ తల చనిపోయిన ఏడాది తర్వాత కోడలు సోనమ్ 2018 ఆగస్టులో అత్తగారి గదిని శుభ్రం చేస్తుండగా అతను అత్తగారి డైరీ దొరికింది. ఇందుకే ఎన్నో వంటకాల గురించి రాసి ఉంది. అయితే సోనమ్ కు వంటలపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే వారు లాక్ డౌన్ టైంలో వీళ్లు ఇంట్లోనే ఉండటంతో అత్తగారి డైరీలో ఉన్న వంటకాలను ట్రై చేశారు. ఆమెకు ఇష్టమైన గోంగూర పచ్చని నుంచి ఫేమస్ మల్గోపోడి వరకు అన్ని రకాల వంటకాలను డైటరీలో రాశారు.
అయితే కోడలు ఆ డైరీలో ఉన్న వంటకాన్ని ట్రై చేసింది. అలాగే తన చుట్టాలకు కూడా వీటిని పంపించేంది. అందరి నుంచి మంచి రెస్పాండ్ వచ్చింది. దీంతో ఆమె దీన్నే వ్యాపారంగా చేయాలనుకుంది.అయితే ఈ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు తన మామగారు ఎంతో సపోర్ట్ చేసారు. సోనమ్, అజయ్ ప్లాన్ తో వ్యాపాన్ని ప్రారంభించారు.
నగరంలోని వివిధ ఎగ్జిబీషన్లలో స్టాల్స్ లో ప్రారంభమైన ఈ వ్యాపారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది సోనమ్ ను మరింత ప్రోత్సహించింది.మార్కెట్ లో ఏం కావాలి? ఏ ఉత్పత్తులకు ఎక్కువ అమ్మకాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది వారికి ఎంతో సహాయపడింది.
నెలకు 100 ఆర్డర్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో కంపెనీని ప్రారంభించారు. తన అమ్మకాల మొదటి నెలలో రూ.5 లక్షలు సంపాదించారు. అంటే ప్రతి నెలా వీరు 2000 కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. వీరు 21 రకాల ఊరగాయల, పౌడర్, చట్నీలు ఉన్నాయి. వీటి ధర రూ.175 నుంచి రూ.225 వరకు ఉంటుంది. ఈ ఉత్పత్తులన్నీ ఆన్లైన్ రిటైల్ ప్లాట్ ఫామ్ లో లభిస్తాయి.