గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ (CEO)గా భార‌త సంత‌తికి చెందిన‌ లక్ష్మణ్ నరసింహన్‌ను నియమించింది. నరసింహన్ ప్రస్తుతం హెల్త్ అండ్ హైజీన్ కంపెనీ రెకిట్‌కి సారథ్యం వహిస్తున్నారు. 

ప్రపంచ అతిపెద్ద కాఫీ చైన్‌ స్టార్‌బక్స్ నూత‌న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ (CEO)గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్​ నరసింహన్​ నియమితులయ్యారు. ఆయ‌న అక్టోబర్ 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు
ఈ మేర‌కు స్టార్‌బక్స్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీకి ప్రవాస భారతీయుడు సీఈవోగా ఎంపిక కావడం విశేషం.

ప్రస్తుతం స్టార్‌బక్స్‌ సీఈఓ హోవర్డ్​ షుల్ట్​జ్​ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న స్థానంలో లక్ష్మణ్​ నరసింహన్‌ను స్టార్‌బక్స్ నియమించింది. ఆయ‌న అక్టోబర్‌లో స్టార్‌బక్స్ లో చేర‌నున్నారు. తొలుత‌ తాత్కాలిక CEO గా 
వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఏప్రిల్1న 2023 నుండి పూర్తి స్థాయిలో బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇటీవలసంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంస్థ రీఇన్వెన్షన్ ప్ర‌ణాళిక గురించి కొన్ని నెలలు తీవ్ర కసరత్తు చేయనున్నారు.

ల‌క్ష్మ‌ణ్ గ‌తంలో లైసాల్ అండ్ ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా కంపెనీలో సీఈవోగా చేశారు. ఇండిపెండెంట్ స్టార్‌బక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్ మెలోడీ హాబ్సన్ త‌న ప్రకటనలో లక్ష్మణ్ నరసింహన్ ఓ స్పూర్తిదాయకమైన నాయకుడని పేర్కొన్నారు. గ్లోబల్ కన్స్యూమర్-ఫేసింగ్ బిజినెస్‌లలో అతని అనుభవం.. స్టార్‌బక్స్ వృద్ధిని వేగవంతం చేయడానికి, ముందున్న అవకాశాలను చేజిక్కించుకోవడానికి తోడ్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

లక్ష్మణ్​ నరసింహన్​ ప్రత్యేకత ఏంటంటే?

స్టార్‌బక్స్ తదుపరి CEO లక్ష్మణ్​ నరసింహన్ పూణే విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజినీరింగ్ ప‌ట్టా పొందాడు. ఆ త‌రువాత పై చ‌దువు కోసం.. జ‌ర్మ‌నీలోకి వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జ‌ర్మ‌నీ లోని లాడర్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. దీనితో పాటు, అతను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ నుండి ఫైనాన్స్‌లో MBA కూడా చేశారు. 

లక్ష్మణ్ నరసింహన్ సెప్టెంబరు 2019లో డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను తయారు చేసే రెకిట్‌ సంస్థకు రెకిట్‌లో చేరారు. గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా సహా పెప్సికోలో అనేక నాయకత్వ పాత్రలను నిర్వహించాడు. ఆ కంపెనీ యొక్క‌ లాటిన్ అమెరికా, యూరప్, స‌బ్-సహారా ఆఫ్రికా కార్యకలాపాలకు CEOగా కూడా పనిచేశాడు. గతంలో పెప్సికో లాటిన్ అమెరికా యొక్క CEOగా, పెప్సికో అమెరికాస్ ఫుడ్స్ యొక్క CFOగా కూడా పనిచేశాడు. దీనికి ముందు.. నరసింహన్ మెకిన్సే & కంపెనీలో ప‌ని చేశారు. అతను బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు ట్రస్టీ కూడా. UK ప్రైమ్ మినిస్టర్స్ బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్‌లో సభ్యుడిగా కూడా పనిచేశారు. వెరిజోన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగా ఉన్నారు.

తన నియామకంపై లక్ష్మణ్​ నరసింహన్ మాట్లాడుతూ.. కనెక్షన్, భావోద్వేగాల ద్వారా మానవాళిని ముందుకు తీసుకురావడానికి.. స్టార్‌బక్స్ నిబద్ధత లో ప‌ని చేస్తుంద‌ని, ఆ విష‌యమే ఈ కంపెనీని ఇతరుల నుండి వేరు చేసిందని అన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్ అని, ఇది కాఫీతో కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చిందని ఆయన అన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఈ దిగ్గజ సంస్థతో అనుబంధం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కంపెనీ అధిక‌ పెట్టుబడులను చూస్తుంది. రోజు మారుతున్న డిమాండ్‌లను అనుగుణంగా.. కంపెనీని తీర్చడానికి కృష్టి చేస్తాన‌ని అన్నారు. భవిష్యత్తులో కంపెనీ మరింత ముందుకు తీసుకెళ్తాన‌ని తెలిపారు. హోవార్డ్, బోర్డు మొత్తం నాయకత్వ బృందంతో కలిసి పని చేస్తానని నరసింహన్ తన ప్రకటనలో తెలిపారు. అతను లండన్ నుండి వాషింగ్టన్ లోని సియాటిల్ కి మారనున్నాడు. ఏప్రిల్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించే ముందు షుల్ట్‌తో కలిసి పని చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ప్రపంచంలో ప‌లు అతిపెద్ద కంపెనీలకు భార‌త సంత‌తి చెందిన వ్య‌క్తులు సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
ఈ జాబితాలో తాజాగా ల‌క్ష్మ‌ణ్ నరసింహన్ చేరారు. అంతముందు.. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్, డెలాయిట్ సీఈవోగా పునీత్ రంజన్, ఫెడెక్స్ సీఈవోగా రాజ్ సుబ్రమణ్యం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంతకు ముందు పెప్సీకో సీఈవోగా ఇంద్రా నూయి, మాస్టర్ కార్డ్ సీఈవోగా అజయ్ బంగా వంటి ప్ర‌ముఖులు దిగ్గజ కంపెనీలకు సీఈవోగా పనిచేశారు.