Asianet News TeluguAsianet News Telugu

మృత్యుంజయుడు : కత్తిపోటుకు గురైన వ్యక్తి మెడపై కత్తితోనే ఆస్పత్రికి.. నాలుగు గంటల ఆపరేషన్ తో మిరాకిల్..

ఓ వ్యాపారి మీద తమ్ముడే కత్తితో దాడి చేశాడు. మెడమీద గుచ్చుకున్న కత్తితో ఆ వ్యక్తి వెంటనే ఆస్పత్రికి పరిగెత్తాడు. నాలుగు గంటల ఆపరేషన్ తరువాత మృత్యుంజయుడిగా నిలిచాడు. 

Stabbed man rides to hospital with knife in neck, survives In mumbai - bsb
Author
First Published Jun 6, 2023, 1:05 PM IST

ముంబై : వ్యాపారవేత్త అయిన ఓ వ్యక్తిని పడుకున్న సమయంలో అతని అన్న మెడమీద కత్తితో పొడిచాడు. వెంటనే మెలుకువ వచ్చిన అతడిని చూసి అన్న పారిపోయాడు. మెడలో దిగిన తుప్పుపట్టిన కత్తితో ఆ వ్యక్తి అలాగే ఓ కిలోమీటర్ దూరంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు వెంటనే స్పందించడంతో అతను తృటిలో మృత్యువునుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. 

30 ఏళ్ల వ్యాపారవేత్త అయిన తేజస్ పాటిల్, జూన్ 3న నిద్రిస్తున్న సమయంలో అతని సోదరుడు కత్తితో దాడిచేసి.. మెడమీద పొడిచాడు. తుప్పుపట్టిన కత్తి మెడకు గుచ్చుకుంది. తేజస్ లేవడంతో.. అతని సోదరుడు మోనీష్ తన స్నేహితులతో కలిసి పారిపోయాడు. తేజస్ ఆలస్యం చేయకుండా దగ్గర్లోని ఎంపీసీటీ హాస్పిటల్‌కి.. మెడలోని కత్తితో అలాగే వెళ్లాడు. 

అక్కడ వైద్యులు తేజస్ పాటిల్ మెడలోని కత్తిని తొలగించి, దెబ్బతిన్న రక్తనాళాలను సరిచేయడం కోసం 4 గంటలపాటు శస్త్రచికిత్స చేశారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే అనేక ప్రధాన రక్తనాళాలు దెబ్బతినలేదని.. కత్తి కాస్త అటూ, ఇటూ అయితే.. ఆ రక్తనాళాలు తెగి ప్రాణానికి ప్రమాదం ఉండేదని తెలిపారు. తేజస్ సోమవారం ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చబడ్డాడు.

అర్థరాత్రి, తాగి ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. బర్త్ డే విషెస్ చెప్పడానికి వెళ్లి.. దారుణ హత్యకు గురై..

శనివారం కుటుంబ కలహాలతో 28 ఏళ్ల సోదరుడు మోనీష్.. తేజస్ మెడపై కత్తితో పొడిచిన ఘటన మీద మాట్లాడుతూ "మోనీష్ నన్ను చంపడానికి ప్రయత్నించడం నేను ఇప్పటికీ షాక్‌ అవుతున్నాను. నమ్మలేకపోతున్నాను" అని  చెప్పాడు. మోనీష్‌కు మద్యం సేవించే అలవాటు ఉందని.. దాడి జరిగినప్పుడు అతనితో పాటు తుర్భే మహేష్ అనే స్నేహితుడు కూడా ఉన్నాడని పాటిల్ చెప్పాడు.

గతంలో తన వాటర్ ట్యాంకర్ సరఫరా వ్యాపారంలో మోనిష్‌ను భాగస్వామిని చేశానని, అయితే అతని చెడు స్నేహాల కారణంగా పని నిర్లక్ష్యం చేశాడని పాటిల్ చెప్పాడు. మోనిష్ మీద భారతీయ శిక్షాస్మృతి కింద 'హత్యాయత్నం' కింద క్రిమినల్ నేరం సంపాద పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. పరారీలో ఉన్న దుండగుడి కోసం వేట ప్రారంభించారు పోలీసులు.

ఎంపీటీసీ హాస్పిటల్‌ వైద్యులు మాట్లాడుతూ, కత్తిపోట్లకు గురవ్వగానే చాలామందికి ఆలోచన పనిచేయదని కానీ.. పాటిల్ మెడపై కత్తితో ఆసుపత్రికి రావాలనుకోవడం.. ప్రయత్నపూర్వకంగా రావడం ప్రశంసనీయం అన్నారు.  కత్తిపోటు గురించి పాటిల్ తన బావ భూపేంద్ర సింగ్‌కు కూడా ఫోన్ చేశాడు. పాటిల్ భార్య ప్రెగ్నెన్సీ చెకప్ కోసం ఉల్వేలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 

ఎంపీసీటీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ప్రిన్స్ సురానా మాట్లాడుతూ.. పాటిల్ లోపలికి రాగానే మెడ, మెదడు, ఛాతీకి సీటీ స్కాన్ నిర్వహించి కత్తి బ్లేడ్ మెడకు ఏ మేరకు గుచ్చుకుని నష్టం జరిగిందో తనిఖీ చేశాం. శాశ్వత వైకల్యం లేదా మరణానికి కారణమయ్యే ధమనులు, నరాలను దెబ్బతీయకుండా కత్తిని తొలగించవచ్చని నిర్ధారించడానికి ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, హార్ట్ సర్జన్‌ల బృందం సమావేశమైంది.

వైద్యులు మెడ వెనుక భాగం నుండి కొంత రక్తస్రావం జరగడం గమనించారు. వెన్నుపూసకు రక్తాన్ని సరఫరా చేసే వెన్నుపూస ధమనిని తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ధమని దెబ్బతిన్నదని వారు గ్రహించారు.డాక్టర్ సురానా మాట్లాడుతూ, "అదృష్టవశాత్తూ రోగికి, ఎడమవైపు వెన్నుపూస ధమని తగినంత క్రాస్-ఫ్లో అందించింది. మెదడు/సెరెబెల్లమ్‌కు ప్రసరణను కొనసాగించింది. లేదంటే, మెదడు నాళాలకు రక్త ప్రవాహం లేకపోవడం వల్ల అతను స్ట్రోక్ లేదా ఇస్కీమియా బారిన పడేవాడు" అన్నారు.

సాధారణ వార్డుకు మార్చడానికి ముందు పాటిల్ ఒక రోజు పాటు మెకానికల్ వెంటిలేటర్ సపోర్టులో ఉన్నారు. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తారన్నారు.

ఆదివారం ఆసుపత్రిలో పాటిల్‌ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నామని, పాటిల్ నిందితుడెవరో చెప్పారని సంపాద పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ బాపురావ్ దేశ్‌ముఖ్ తెలిపారు."ఆసుపత్రి వైద్య నివేదిక ప్రకారం, భారతీయ శిక్షాస్మృతిలోని 307 సెక్షన్‌ను అమలు చేసాం, అది నిందితుడిపై 'హత్య ప్రయత్నం' అభియోగం మోపుతుంది" అని సీనియర్ ఇన్‌స్పెక్టర్ దేశ్‌ముఖ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios