సారాంశం
అర్థరాత్రి ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లిన యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.
కోయంబత్తూరు : తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మైలదుంపరై వద్ద 21 ఏళ్ల యువకుడిని హత్య చేశారు. తన ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లడంతో సోమవారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో ప్రియురాలి బంధువు అతడిని హత్య చేశాడు.
మృతుడు కోయంబత్తూరు నగరంలోని సుందరపురం దగ్గరుండే గాంధీ నగర్‌కు చెందిన వి.ప్రశాంత్‌గా గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో లోడ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం 18 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఏడాది తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
బెంగళూరులో హైదరాబాద్ కు చెందిన మహిళ అనుమానాస్పద మృతి..
ప్రశాంత్ రోజూ తన స్నేహితురాలితో ఫోన్‌లో మాట్లాడేవాడు. అయితే గత రెండు రోజులుగా ప్రశాంత్‌తో మాట్లాడేందుకు ఆమె తండ్రి అనుమతించలేదని పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున తన ప్రియురాలి పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలవాలనుకున్నాడు ప్రశాంత్. అందుకోసం స్కూటర్‌పై తన ముగ్గురు స్నేహితులైన ధరణి, గుణశేఖరన్, అభిషేక్‌లతో కలిసి ప్రశాంత్ మైలదుంపరై వద్ద వసంతం నగర్‌లోని ఆమె నివాసానికి వెళ్లాడు. ఆ సమయంలో ప్రశాంత్ మద్యం మత్తులో ఉన్నాడు.
ఆ నలుగురు యువకులు కాంపౌండ్ వాల్ దూకి తలుపు తట్టారు. ఆమె తండ్రి, ఆమె తల్లి బంధువు, కాల్ టాక్సీ డ్రైవర్ ఎం విఘ్నేష్ (29) తలుపు తెరిచారు. ప్రశాంత్ తన స్నేహితురాలికి ఫోన్ చేసి పలకరించాడు. విఘ్నేష్.. ప్రశాంత్, అతని ముగ్గురు స్నేహితులతో గొడవ పడ్డాడు.
విఘ్నేష్ ఒక కొడవలి తీసుకొని ప్రశాంత్ ఎడమ ఛాతీ, ఎడమ భుజంపై దాడి చేశాడు. స్నేహితులు ప్రశాంత్‌ను స్కూటర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సుందరాపురం సమీపంలోకి రాగానే వారు వచ్చిన బండిలో పెట్రోల్ అయిపోయింది. వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి అతడిని కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అక్కడ వైద్యులు ప్రశాంత్ చనిపోయినట్లు ప్రకటించారు. చెట్టిపాళయం పోలీసులు విఘ్నేష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.