కల్తీ మద్యం మహమ్మారి  ప్రజల ప్రణాలతో చెలగాటమాడుతుంది. పంజాబ్ లో కల్తీ మద్యం తాగి 41 మంది మరణించారు. గత రెండు రోజులుగా పంజాబ్ లోని మూడు జిల్లాల పరిధిలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్  ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. 

అమృత్ సర్, తరన్ తారన్, బాటల జిల్లాల పరిధిలో  ఘటనలు చోటు చేసుకున్నాయి. 20 నుంచి 80 సంవత్సరాల వయసుల మధ్యవారు ఏ ఘటనలో మరణించారు. మద్యం అమ్మినట్టుగా భావిస్తున్న మహిళ భర్త కూడా చనిపోయాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. 

జులై 29 రాత్రి తొలిసారి 5 మరణాలు ,నమోదయ్యాయని  పోలీసులు తెలిపారు. ఆ తరువాత గురువారం సాయంత్రానికి మరో ముగ్గురు మరణించారని, ఈ కేసులు స్థానిక ఠాణాల్లో నమోదు చేసేలోపే మరో 5 మరణాలు సంభవించినట్టుగా వారు తెలిపారు. 

ముచ్చల్ గ్రామానికి చెందిన బల్విందర్ కౌర్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేసారు. ఎక్సయిజ్ చట్టం ప్రకారంగా ఆమెను అరెస్ట్ చేసారు. రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ పై ఉక్కుపాదం మోపాలని, ఎక్కడెక్కడ అక్రమ మద్యం తయావుతుందో వాటిని ధ్వంసం చేయాలనీ ఆదేశించారు ముఖ్యమంత్రి. 

బాధిత కుటుంబాలకు చెందినవారు మాట్లాడుతూ ఇంటికి వచ్చే సరికే వారు స్థిమితంగా లేరని, వాంతులు అవడంతో ఆసుపత్రిలో చేర్పించగానే మరణించాడని బూటా రామ్ అనే వ్యక్తి కుటుంబీకుడు చెప్పాడు.