వరదలో చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొన్న ఓ కుటుంబాన్ని  ముంబైలో  స్థానికులు  కాపాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఈ వీడియో వైరల్ గా మారింది వరదలో చిక్కుకొన్న వారిని స్థానికులు అత్యంత ధైర్యంతో  కాపాడారు.

ముంబై:వరదలో చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొన్న ఓ కుటుంబాన్ని ముంబైలో స్థానికులు కాపాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. వరదలో చిక్కుకొన్న వారిని స్థానికులు అత్యంత ధైర్యంతో కాపాడారు.

 అశ్రఫ్ ఖలీల్ అతని భార్య హమిదతో పాటు ఇద్దరు పిల్లలు కారులో ప్రయాణం చేస్తున్నారు. అయితే వారు ప్రయాణీస్తున్న కారు ముంబై సమీపంలో అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఆ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద కూడ భారీగానే వచ్చి చేరుతోంది. దీంతో ప్రాణాలను కాపాడుకొనేందుకు ఆ కుటుంబం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది.

Scroll to load tweet…

అయితే కారుపైకి ఎక్కిన బాధిత కుటుంబం సహాయం కోసం ఎదురు చూసింది. తమను కాపాడాలని అరిచారు. వీరు ప్రయాణీస్తున్న కారు నదిలోని బండల మధ్య నిలిచిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తాడును వారి వద్దకు చేర్చారు. తాడు సహాయంతో బాధితులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకొన్నారు. 

వరదలో చిక్కుకొన్న వారిని వరద ప్రవాహం నుండి బయటకు వచ్చేలా స్థానికులు అత్యంత ధైర్య సాహసాలను చూపారు. వరదలో చిక్కుకొన్న అశ్రఫ్ ఖలీల్ కుటుంబాన్ని స్థానికులు రక్షించారు. ఈ తతంగాన్ని స్థానికులు వీడియో తీశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.