Asianet News TeluguAsianet News Telugu

స్పైస్‌జెట్ లో గొడవ.. సిబ్బందిని దూషించిన ప్రయాణికుడు.. నెట్టింట్లో వీడియో వైరల్ 

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో ఓ ప్రయాణికుడిని విమానం నుంచి దింపారు.

SpiceJet deboards 2 passengers over 'unruly' behaviour
Author
First Published Jan 24, 2023, 4:57 AM IST

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన మరో ఘటన వెలుగు చూసింది. ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడి, అతని సహ ప్రయాణికుడిని విమానం నుండి దింపారు.

స్పైస్‌జెట్ వెట్-లీజ్డ్ కొరోండెన్ ఫ్లైట్ జనవరి 23, 2023న ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు షెడ్యూల్ చేయబడింది. అయితే.. బోర్డింగ్ సమయంలో ఓ ప్రయాణికుడు వికృతంగా, అనుచితంగా ప్రవర్తిస్తూ క్యాబిన్ సిబ్బందిని వేధించాడు. ఈ ఘటనపై క్యాబిన్ సిబ్బంది పీఐసీకి, సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిని , సహ ప్రయాణికుడిని విమానం నుండి దింపారు. అనంతరం భద్రతా బృందాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ముందు కూడా విమానంలో ప్రయాణీకుల కోలాహలం జరిగిన విషయం తెలిసిందే..

గతంలోనూ ఇలాంటి సంఘటనలు 

విమానంలో ప్రయాణీకులు దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ ఏడాది జనవరి 9న ఢిల్లీ నుంచి పాట్నా వస్తున్న విమానంలో డ్రగ్స్‌కు బానిసైన యువకులు ఎయిర్ హోస్టెస్, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి రావడం విశేషం.

దీని తర్వాత, పాట్నా విమానాశ్రయంలో మద్యం తాగి రచ్చ సృష్టించిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. అంతే కాదు..  గతేడాది డిసెంబర్ 29న బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వస్తున్న థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో సీటు విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.పలువురు ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  ఇది కాకుండా.. డిసెంబర్ 2022 లో ఇండిగో ఎయిర్‌లైన్ విమానంలో ఎయిర్ హోస్టెస్,ప్రయాణీకులు ఇద్దరూ ఒకరినొకరు అరిచుకున్న వీడియో బహిర్గతమైంది.ప్రయాణీకుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించాడు.ఎయిర్ హోస్టెస్‌ను అవమానించాడు, ఆ తర్వాత భద్రత సిబ్బంది జోక్యం చేసుకోవలసి వచ్చింది.

అంతకు ముందు 26 నవంబర్ 2022న, ఎయిర్ ఇండియా (AI)కి చెందిన మహిళా ప్రయాణీకురాలితో అనుచితంగా ప్రవర్తించినందుకు విమానయాన సంస్థకు DGCA జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎయిర్ ఇండియాకు డీసీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు విమాన పైలట్.. ఇన్ కమాండ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. దీనితో పాటు, AI  డైరెక్టర్-ఇన్-ఫ్లైట్ సర్వీసెస్‌కు రూ.3 లక్షల జరిమానా విధించబడింది.

వాస్తవానికి 26 నవంబర్ 2022న, న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడు శంకర్ మిశ్రా ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. దీని తర్వాత ఢిల్లీ పోలీసుల ఆదేశాల మేరకు ఇమ్మిగ్రేషన్ బ్యూరో వ్యక్తిపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసింది.

ఇది కాకుండా.. నిందితుడి గురించి సమాచారం పొందడానికి, ఢిల్లీ పోలీసుల బృందం నిందితుడు ఎస్ మిశ్రా బంధువును కలవడానికి ముంబైకి చేరుకుంది. విచారణ కూడా చేసింది. అంతకుముందు.. తన స్థాయిలో చర్యలు తీసుకుంటూ.. ఎయిర్ ఇండియా నిందితులపై 30 రోజుల పాటు ప్రయాణ నిషేధాన్ని విధించింది. నిందితుడిని ఢిల్లీ పోలీసులు జనవరి 6న బెంగళూరులో అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios