Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో ట్రక్కు బీభత్సం, చిన్నారులతో సహా.. 12మంది మృతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోదీ..

బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు చిన్నారులు సహా 12 మంది చనిపోయారు.

speeding truck rams into crowd in Bihar, 12 killed, PM grants Rs 2 lakh ex-gratia
Author
First Published Nov 21, 2022, 7:43 AM IST

బీహార్‌ : బీహార్‌లోని వైశాలి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు చిన్నారులతో సహా 12 మంది మరణించారు. వైశాలి జిల్లా మెహనార్ గ్రామంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంపై "తీవ్ర విచారం" వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ..  క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని సంబంధిత అధికారులందరినీ కోరారు. డిప్యూటీ తేజస్వి యాదవ్ కూడా ట్విట్టర్‌లో ఇలా అన్నారు, “భగవంతుడు మరణించిన వారి ఆత్మలకు శాంతిని, వారి కుటుంబాలకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.”

బెంగాల్ లో ఢిల్లీ తరహా ఘటన.. తండ్రిని హత్య చేసి.. తల్లి సాయంతో ముక్కలుగా నరికి.. దారుణం...

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాదంపై స్పందించారు. "ఇది చాలా బాధాకరమైనది" అన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని హోం వ్యవహారాల సహాయ మంత్రి (MoS) నిత్యానంద రాయ్ ఆకాంక్షించారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ ట్విటర్‌లో ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జాప్) అధ్యక్షుడు బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. "కావాల్సిన సాయం అందించడానికి మా కార్యకర్తలు ఘటనాస్థలంలో సిద్ధంగా ఉన్నారు!"

ఈ ఘటనకు సంబంధించి ట్రక్కు డ్రైవర్‌, సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా లేదా అనేది వైద్య పరీక్షల తర్వాతే నిర్ధారిస్తామని వైశాలి ఎస్పీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios