గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడినవారు స్థానికులు, పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యలకు సమాచారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బాధితుల్లో ఎక్కువ మంది పంచమహల్ జిల్లాలోని కాకోల్ నివాసితులని, వారు అంబాజీ ఆలయాన్ని సందర్శించడానికి కాలినడకన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించనున్నట్టుగా చెప్పారు.
