బెంగుళూరు: స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను  కర్ణాటక సీఎం కుమారస్వామి సోమవారం నాడు కలిశారు.కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సమావేశం తర్వాత స్పీకర్ రమేష్‌కుమార్ ను సీఎం కుమారస్వామి కలిశారు. నాలుగు రోజుల క్రితం తాను విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానని సీఎం కుమారస్వామి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే విశ్వాస పరీక్షకు సమయం కావాలని కుమారస్వామి అడిగారు.

బలపరీక్షను ఇవాళే చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో  స్పీకర్ రమేష్ కుమార్‌తో సీఎం కుమారస్వామి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారోననేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.