యువతిపై స్పా యజమాని దాష్టీకం.. బట్టలు చించి, జుట్టుపట్టుకుని లాగి, చెంపదెబ్బలు కొడుతూ వీరంగం...
నిందితుడిని గెలాక్సీ స్పాను నిర్వహిస్తున్న మొహ్సిన్‌గా గుర్తించారు. ఈ దాడి ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. వైరల్ ఫుటేజ్‌లో, మొహ్సిన్ నడిరోడ్డుపై ఒక మహిళ జుట్టు పట్టుకుని లాగడం, బట్టలు చించడం గమనించవచ్చు.

అహ్మదాబాద్ : అహ్మదాబాద్ లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ స్పా యజమాని నడిరోడ్డు మీద ఓ యువతి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఆ యువతి జుట్టు పట్టుకొని లాగుతూ, బట్టలు చింపుతో, చెంపల మీద దెబ్బలు కొడుతూ… వేధింపులకు పాల్పడ్డాడు. నడిరోడ్డుపై ఈ దారుణం జరుగుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారు.. దాన్ని కళ్లప్పగించి చూస్తుండిపోయారే తప్ప ఆపడానికి ప్రయత్నించలేదు.
అయితే దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్ లోని గెలాక్సీ యజమాని మొహ్సిన్. ఆయనకు బిజినెస్ పార్టనర్ గా ఓ 24 యేళ్ల యువతి ఉంది. తన స్పా ముందే మొహ్సిన్ ఆ యువతిపై దాడికి తెగబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై రాత్రిపూట ఆ యువతిపై మొహ్సిన్ పై పదే పదే దాడి చేయడం కనిపిస్తోంది.
అథ్లెట్లను స్టేడియం నుంచి తరిమేసి, కుక్కతో వాకింగ్... ఐఏఎస్ అధికారిణికి బలవంతపు రిటైర్మెంట్..
దాడితో ఊరుకోకుండా… ఆమె తపించుకుంటుంటే ఆమె వెంట పడుతూ బట్టలు చింపడానికి ప్రయత్నించాడు. అతని వికృత చేష్టలను ఆపడానికి ఆ యువతి ప్రయత్నించినా కూడా.. అతని పశుబలం ముందు సాధ్యపడలేదు. ఆ తర్వాత అతను యువతి చెంపలపై కొడుతూ.. జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. దాదాపు నాలుగు నిమిషాల సేపు ఈ వికృత చేష్టలు కొనసాగాయి.
అయితే ఈ ఘటన సెప్టెంబర్ 25న జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. కానీ, వారు కూడా అతనికే మద్దతు ఇచ్చారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇదంతా చూసిన ఓ సామాజిక కార్యకర్త బోడక్ దేవ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని రక్షించారు. పోలీసులు వచ్చేటప్పటికి నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు.
ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారని సమాచారం. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు రోజుల వరకు యువతి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు కానీ సెప్టెంబర్ 27వ తేదీన దీనిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలోనే అతనితో దెబ్బలు తిన్న యువతి స్పా బిజినెస్ లో భాగస్వామి అని తేలింది. బిజినెస్ విషయంలోనే భాగస్వాములైన ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని అది హింసాత్మకంగా మారిందని పోలీసులు గుర్తించారు.
యువతి మీద అత్యంత పాశవికంగా దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీలో రికార్డయిన ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో చూసిన నెటిజన్లు నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణమేదైనా సరే మహిళ మీద అంత దారుణంగా దాడి చేయడం కరెక్ట్ కాదని.. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.