పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ  భీమశంకర్ గుళేద్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దావణగెరె జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో బెంగళూరు రూరల్ ఎస్పీ భీమశంకర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆధారాలతో సహా బయటపెట్టడం కర్ణాటకలో సంచలనం కలిగించింది.

వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు మీడియాలో హల్‌చల్ చేయడంతో పాటు.. మరో మహిళతో సంబంధం పెట్టుకున్న తన భర్త.. తనను రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ ఎస్పీ భార్య  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎస్పీ వివాహేతర సంబంధంపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ డీజీపీని ఆదేశించారు.. అనంతరం ఎస్పీపై బదిలీ వేయాలని.. ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా రిజర్వ్‌లో ఉంచాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

2016లో దావణగెరె జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో పట్టణంలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న మహిళతో భీమశంకర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఇద్దరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోవైపు వీడియోలో  ఉన్న మహిళ భర్తపైనే ఆరోపణలు చేసింది. తన భర్త తనను వేధించేవాడని.. అందుకే ఈ విధంగా తన పరువును తీస్తున్నాడని.. తనకు ఎస్పీకి ఎలాంటి సంబంధం లేదని పలు ఛానెళ్లకు చెప్పడం కొసమెరుపు.