దక్షిణ సూడాన్ అధ్యక్షుడు తన మీదనే మూత్ర విసర్జన చేసుకున్నట్టు చూపిస్తున్న ఓ వీడియో డిసెంబర్‌లో వైరల్ అయింది. ఈ వీడియోను వైరల్ చేశారనే అభియోగాలతో ప్రభుత్వ అధీనంలోని మీడియా సంస్థకు చెందిన ఆరుగురు సిబ్బందిని అధికారులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను మీడియా సంఘాలు ఖండించాయి. 

న్యూఢిల్లీ: దక్షిణా సూడాన్ అధ్యక్షుడు సాల్వా కీర్ తనపైనే మూత్ర విసర్జన చేసుకున్నట్టు చూపిస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ వెనుక కొంత మంది జర్నలిస్టులు ఉన్నారనే అభియోగాలతో అరెస్టు జరిగాయి. ఆరుగురు జర్నలిస్టులను అధికారులు అరెస్టు చేశారు. మీడియా సంఘాలు ఈ అరెస్టులను ఖండించాయి. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అరెస్టు చేసిన వారిని చట్టబద్ధంగా విచారించాలని కోరాయి.

ప్రభుత్వ అధీనంలో నడిచే దక్షిణ సూడాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు చెందిన సిబ్బందిని నేషనల్ సెక్యూరిటీ సర్వీస్ ఏజెంట్లు మంగళవారం అరెస్టు చేశారు. మీడియా కథనాలు, ఇతర వర్గాలను పేర్కొంటూ జర్నలిస్టుల రక్షణ కమిటీ ఈ మేరకు తెలిపింది.

డిసెంబర్ నెలలో వైరల్ అయిన ఓ వీడియో ఫుటేజీకి సంబంధించిన విషయంలో వారిని విచారిస్తున్నారని న్యూయార్క్‌కు చెందిన సీపీజే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: అంతుచిక్కని వ్యాధితో సూడాన్‌లో సుమారు 100 మంది మృతి.. అప్రమత్తమైన డబ్ల్యూహెచ్‌వో టాస్క్ ఫోర్స్

యూట్యూబ్‌లో పోస్టు అయిన ఆ వీడియోలో అధ్యక్షుడు కీర్ తన మార్క్ డ్రెస్సింగ్ నల్లటి హ్యాట్, గోధుమ వర్ణం ఔట్‌ఫిట్‌తో కనిపించారు. ఆయన ఓ రోడ్డు ప్రారంభ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. ఆయన ఎడమ కాలి ప్యాంట్ పై తడి కనిపించింది. ఆ ఫుటేజీని తమ ఔట్‌లెట్ ప్రసారం చేయలేదని స్వతంత్ర రేడియో స్టేషన్ ద్వారా ఓ ఎస్ఎస్‌బీసీ అధికారి తెలిపారు.