Asianet News TeluguAsianet News Telugu

Covid19: దక్షిణాఫ్రికా నుంచి భారత్ కి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్..!

దక్షిణాఫ్రికాలో భయంకరమైన ఓమైక్రాన్ వేరియెంట్ ప్రబలిన నేపథ్యంలో కరోనా పాజిటివ్ ప్రయాణికుడిని కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటరుకు తరలించారు.

South Africa Returned Man  tested Corona positive
Author
hyderabad, First Published Nov 29, 2021, 10:51 AM IST

దేశంలో థర్డ్ వేవ్ మళ్లీ ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా.. దక్షిణాఫ్రికా నుంచి భారత్ కి వచ్చిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఓమైక్రాన్ వేరియెంట్ సోకిన దక్షిణాఫ్రికా దేశం నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలీ ప్రాంతానికి కొవిడ్-19 పాజిటివ్ ప్రయాణికుడు వచ్చాడు. 

Also Read: ఒమిక్రాన్ వేరియంట్ కలకలం... కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన హైలెవల్ భేటీ

కరోనా సోకిన దక్షిణాఫ్రికా ప్రయాణికుడికి ఓమైక్రాన్ వేరియంట్‌ కరోనా వైరస్‌ ఉందో   లేదో తెలుసుకోవడానికి అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. దక్షిణాఫ్రికాలో భయంకరమైన ఓమైక్రాన్ వేరియెంట్ ప్రబలిన నేపథ్యంలో కరోనా పాజిటివ్ ప్రయాణికుడిని కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటరుకు తరలించారు.ఈ కరోనా రోగి నవంబర్ 24న దక్షిణాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చి, ఆపై ముంబైకు వెళ్లారు. 

Also Read: Omicron Variant : కేంద్రం అప్రమత్తం.. రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక మార్గదర్శకాలు

దక్షిణాప్రికాకు చెందిన కరోనా రోగి పరిస్థితి నిలకడగా ఉందని కెడిఎంసీ ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతిభా పాన్‌పాటిల్ తెలిపారు. రోగి సోదరుడికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది.రోగి యొక్క ఇతర కుటుంబ సభ్యులకు సోమవారం కొవిడ్ -19 పరీక్షలు చేస్తామని పాటిల్ చెప్పారు. ప్రస్తుతం రోగి కుటుంబసభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు.శనివారం, బెంగళూరులో దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. అయితే వారికి ఓమైక్రాన్ కాకుండా డెల్టా స్ట్రెయిన్ ఆఫ్ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.

Follow Us:
Download App:
  • android
  • ios