Omicron Variant : కేంద్రం అప్రమత్తం.. రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక మార్గదర్శకాలు
కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకే మార్గదర్శకాలను (guide lines) విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లపై (containment zones) ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా పరీక్షలు పెంచాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆదేశించింది.
కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకే మార్గదర్శకాలను (guide lines) విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లపై (containment zones) ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా పరీక్షలు పెంచాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు గైడ్‌లైన్స్ విడుదల చేసింది కేంద్రం. హాట్‌స్పాట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది.
కేంద్రం గైడ్‌లైన్స్:
- ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్.
- ఇంటెన్సివ్ కంటైన్మెంట్, పటిష్ట నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలని రాష్ట్రాలకు సూచన.
- కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశం.
- కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తింపు.
- హాట్ స్పాట్లను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచన.
- పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలి.
- తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచన.
- కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలి.
- కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచన.
- ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని సూచన.
- తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, బులెటిన్లు విడుదల చేయాలని సూచన
అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా Corona నూతన Variant ఒమిక్రాన్(Omicron) భయాందోళనలు వెలువడుతున్న తరుణంలో ప్రధాన మంత్రి Narendra Modi దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఆయన ఈ రోజు 83 ఎడిషన్ మన్ కీ బాత్(Mann Ki Baat) కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ కరోనా మహమ్మారి ముప్పు ఇంకా ముగియలేదని అన్నారు. కాబట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలోనే ఆయన మాట్లాడుతూ, తనకు అధికారం అవసరం లేదని, కేవలం ప్రజలకు సేవ చేయాలనే కోరిక తనలో దృఢంగా ఉన్నదని వివరించారు. సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సహజ వనరుల్లో సమతుల్యతను దెబ్బతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.
Also Read:Omicron: బెంగళూరు విమానాశ్రయంలో ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు
ఆయుష్మాన్ భారత్ గొప్ప పథకమని, పేదలకు ఆరోగ్య వసతులను అందుబాటులో ఉంచడమే దీని ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజనా లబ్దిదారుడితో మాట్లాడారు. తనకు అధికారం అక్కర్లేదని అన్నారు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పమే తనలో ఉన్నదని చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి గురించీ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిలో భారత దేశం ఇప్పుడు కీలక మలుపులో ఉన్నదని వివరించారు. యువత ఇప్పుడు కేవలం ఉద్యోగార్థులే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని వివరించారు. ఇప్పుడు అనేక స్టార్టప్ కంపెనీలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో మూడు రకాల యువత ఉన్నదని అన్నారు. సరికొత్త ఐడియాలు, సృజనాత్మక గలిగిన యువత ఉన్నదని, రిస్క్ తీసుకునే యువత ఉన్నదని తెలిపారు. వీరితోపాటు ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉండే యువత కూడా ఉన్నదని వివరించారు.