Asianet News TeluguAsianet News Telugu

టీనేజర్ల చేతబడి.. స్నేహితుడిని చెరువు దగ్గరికి తీసుకెళ్లి, బొమ్మచేసి, ముగ్గువేసి, పూజలు చేసి.. దారుణహత్య..

నిందితుల్లో ఒకడు తన తాత  దగ్గర చేతబడి లో శిక్షణ పొందాడు. అక్కడ అతను ఒక బొమ్మను తయారు చేసి దానికి మహేష్ అని పేరు పెట్టారు.  ముగ్గు వేసి పూజలు చేసి మహేష్ ను చెరువులో ముంచి  చంపి వెళ్ళిపోయారు.  మహేష్ చెరువు లో ఈత కొడుతూ మునిగిపోయాడు అని ఊర్లో ప్రచారం చేశారు. 

Sorcery and Murder : dark spell of black magic in karnataka, teenagers assassinated friend
Author
Hyderabad, First Published Jan 4, 2022, 7:01 AM IST

మైసూరు : తరాలు మారినా Superstitious మారడం లేదు. యువతరం కూడా ఈ మూఢనమ్మకాల బారిన పడడం నేరస్తులుగా మారడం ఆందోళన కలిగించే విషయం. తెలిసీ తెలియని టీనేజ్ దశలోనే కొంతమంది చేతబడి పేరుతో తమ తోటి స్నేహితుడినే చంప కటకటాల పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

ఈ హైటెక్ యుగంలో కూడా witchcraft నమ్మి ఒక boyని హత్య చేశారు. నిందితులు కూడా మైనర్ బాలలే కావడం గమనార్హం. State of Karnatakaలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. హతుడు హెమ్మరగాల గ్రామానికి చెందిన సిద్ధరాజు కుమారుడు మహేష్ 16.  ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ధనుర్మాసం అమావాస్య కావడంతో పని ఉంది అని చెప్పి మహేష్ ను తీసుకుని, ముగ్గురు స్నేహితులు పట్టణంలోని ఒక చెరువు వద్దకు వచ్చారు.

వారి పనేంటో తెలియని మహేష్, స్నేహితుల్ని నమ్మి ఎప్పట్లాగే వారితో కలిసి వెళ్లాడు. అక్కడ నిందితుల్లో ఒకడు తను తన తాత  దగ్గర చేతబడిలో శిక్షణ పొందానని తెలిపాడు. అది చూపిస్తానని చెప్పి.. అక్కడికక్కడే అతను ఒక బొమ్మను తయారు చేసి దానికి మహేష్ అని పేరు పెట్టారు.  ముగ్గు వేసి పూజలు చేశారు. ఇదంతా చూస్తున్న మహేష్ కు ఏమీ అర్థం కాలేదు. ఇంతలో ముగ్గురూ కలిసి మహేష్ ను చెరువులో ముంచి  చంపి వెళ్ళిపోయారు. 

ఆ తరువాత ఊర్లోకి వెళ్లిన వారిని మహేష్ గురించి ఆరా తీస్తే..  మహేష్ చెరువు లో ఈత కొడుతూ మునిగిపోయాడు అని ప్రచారం చేశారు. దీంతో గ్రామస్తులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ పరిశీలించగా.. చెరువు దగ్గర చేతబడి సామాగ్రి కనిపించింది.  నంజనగూడు పోలీసులు ఆరా తీసి ముగ్గురు మైనర్ బాలులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

Omicron tension : 50 శాతం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. బయోమెట్రిక్ కు బ్రేక్..

ఇదిలా ఉండగా, covid19 కల్లోలంలోనూ క్షుద్రపూజలు ఆగడం లేదు. మహమ్మారికి vaccine కనిపెట్టాం.. కానీ ఈ Superstitionకు ముగింపు పలకలేక పోతున్నాం. తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేటలో witchcraft కలకలం రేపాయి. అచ్చంపేట-మాదిపాడు ప్రధాన రహదారి తాళ్ళచెరువు అడ్డరోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులకు భయాందోళనలకు గురి చేశాయి.

ఓ వరాహాన్ని భయంకరంగా బలి ఇచ్చి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, చీర, చాటలతో పూజలు చేశారు. ప్రధాన రహదారిపై నిరంతరం వాహనాల రద్దీ ఉన్నప్పటికీ pigని చంపి క్షుద్రపూజలు చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  గత రాత్రి అమావాస్య ఆదివారం కావడంతో.. పూజలు వేరే ఎక్కడైనా జరిపి ఇక్కడకు తెచ్చి పడవేశారా అన్న భావన స్థానికుల్లో నెలకొంది.

అమావాస్య ఆదివారం రావడంతో క్షుద్రపూజలు  చేసే మంత్రగాళ్లు రెచ్చిపోయారు. ఆదివారం రోజు వచ్చే అమావాస్యలో పూజలు చేస్తే క్షుద్ర దేవతలు కరుణిస్తాన్న మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే  పూజలు చేసినట్లుగా భావిస్తున్నారు 

Follow Us:
Download App:
  • android
  • ios