Asianet News TeluguAsianet News Telugu

Omicron tension : 50 శాతం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. బయోమెట్రిక్ కు బ్రేక్..

వాస్తవ  సిబ్బంది సంఖ్యలో 50 శాతం మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరు కావాలని, మిగతా సగం మందికి వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని వివరించింది.  దివ్యాంగులు, గర్భిణీలకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా, కంటెయిన్ మెంట్ జోన్ లలో నివాసం ఉండే వారికి కూడా ఆయా జోన్లను డీనోటిఫై చేసేవరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.  

Work from home, biometrics attendance closed for 50% personnel below the level of Under Secretary of the Center
Author
Hyderabad, First Published Jan 4, 2022, 6:36 AM IST

న్యూఢిల్లీ :  దేశంలో corona cases పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా కేంద్ర Government officesల్లోని సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బంది లో 50 శాతం మందికి work from homeకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  భారత ప్రభుత్వ అన్ని all Ministries to departmentsకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని సోమవారం తెలిపింది.  

వాస్తవ  సిబ్బంది సంఖ్యలో 50 శాతం మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరు కావాలని, మిగతా సగం మందికి వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని వివరించింది.  దివ్యాంగులు, గర్భిణీలకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా, కంటెయిన్ మెంట్ జోన్ లలో నివాసం ఉండే వారికి కూడా ఆయా జోన్లను డీనోటిఫై చేసేవరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.  

ఉద్యోగులంతా ఒకే సమయంలో కార్యాలయాలకు రాకుండా అమలు వేర్వేరు పనివేళలను అమలు చేయాలని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అందరూ హాజరు పట్టికలో సంతకాలు చేసి తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా క‌రోనా మరో సారి త‌న పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్ర‌మంలో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై కరోనా వణుకు పుట్టిస్తోంది. ఒక్క రోజే గ‌డిచిన 24 గంట‌ల్లో 8,082 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో 574 మంది రోగులు ఆసుపత్రిలో చేరిగా.. మ‌రో 622 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం యాక్టివ్​ కేసులు సంఖ్య  37,274గా నమోద‌య్యింది. 

Corona Vaccination: తొలిరోజే రికార్డు స్థాయిలో టీనేజర్ల‌కు వ్యాక్సినేష‌న్

తాజా కేసుల‌తో కరోనావైరస్ సంఖ్య 8,07,602 కు పెరిగింది, అయితే మరణాల సంఖ్య 16,379 కు పెరిగింది. అయితే.. తాజాగా న‌మోదైన కేసుల్లో తొంభై శాతం ఎటువంటి లక్షణాలు లేకుండా, లక్షణరహితంగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు.ఆదివారం రోజు నమోదైన 8063 కేసులతో పోలిస్తే .. ఈ రోజు కేసుల సంఖ్య‌లో స్వ‌ల్ప పెరుగుదల ఉంది. కానీ,, ఆదివారం ఆసుపత్రుల్లో చేరినా సంఖ్య‌తో పోల్చుకుంటే.. ఆ సంఖ్య పెరిగిన‌ట్టు తెలుస్తోంది. ఇలా క‌రోనా కేసులు పెరుగుతుంటే.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరిగే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి దశలో ఉన్న‌ట్టు వైద్యులు హెచ్చ‌రిస్తోన్నారు.

ఇదిలాఉంటే.. రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటితే లాక్ డౌన్  లాక్‌డౌన్ ప్రకటిస్తామ‌ని నగర పౌర సంఘం చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ వెల్లడించారు. ఇటీవ‌ల ముఖ్యమంత్రి అధ్యక్షతన జ‌రిగిన ఉన్నత స్థాయి స‌మావేశంలో క‌రోనా విస్త‌ర‌ణ, లాక్‌డౌన్ గురించి  చర్చించామని తెలిపారు. ఈ స‌మ‌యంలో రోజుకు 30 వేల కేసుల వరకు కావలసిన అన్ని వైద్య వసతులు కల్పిస్తున్నామని, ఆక్సిజన్ ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios