‘సోనియా గాంధీ విషకన్య.. ఆమె పాకిస్థాన్, చైనా ఏజెంట్’ - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ విషకన్య అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చైనా, పాకిస్థాన్ కు ఏజెంట్ గా పని చేశారని ఆయన ఆరోపించారు. 

Sonia Gandhi is a bad girl. She is an agent of Pakistan and China - Karnataka BJP MLA Basana Gowda's controversial comments..ISR

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. ఓ పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటోంది. తమ ప్రత్యర్థులపై నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’తో పోల్చి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో చివరికి క్షమాపణ చెప్పాడు.

ఈద్ రోజు మసీదుల వెలుపల నమాజ్ చేశారని 2 వేల మందిపై కేసులు.. యూపీలోని అలీగఢ్ పోలీసుల అభియోగాలు

ఈ పరిణామం చోటు చేసుకున్న మరుసటి రోజు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని‘విషకన్య’ అంటూ అభివర్ణించారు. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ శుక్రవారం మాట్లాడుతూ.. ‘‘ప్రపంచమంతా ప్రధాని మోడీని ఆమోదించింది. అమెరికా ఒకసారి ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. అనంతరం రెడ్‌ కార్పెట్‌ పరచి మరీ మోడీకి స్వాగతం పలికింది. ఇప్పుడు ఆయనను (కాంగ్రెస్‌) నాగుపాముతో పోలుస్తూ విషం చిమ్ముతాడని అంటోంది. సోనియా గాంధీ ఒక విషకన్య. ఆమె చైనా, పాకిస్తాన్‌ ఏజెంట్‌గా పనిచేశారు’’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ‘ఇండియా టుడే’ నివేదించింది.

దీనిపై కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా స్పందించారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసి బీజేపీ నాయకత్వం నిరాశ చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని అవమానించేందుకే బీజేపీ నేతలు ఈ తరహా చర్యకు పాల్పడుతున్నారని తెలిపారు. బసనగౌడ యత్నాల్ పరువు, రాజకీయ సమతూకం, మర్యాద కూడా కోల్పోయారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయమని బీజేపీ సీనియర్ నేతలే ఈ ఎమ్మెల్యేకు సూచించారని ఆయన ఆరోపించారు.

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ?

‘నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని దుర్భాషలాడడమే బీజేపీ నాయకత్వం వృత్తిగా మార్చుకుంది’ అని సూర్జేవాలా అన్నారు. వీటన్నింటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బసవరాజ్ బొమ్మైల మౌన ఆమోదం ఉండటం విచారకరమని తెలిపారు. ప్రధానమంత్రికి గౌరవం, మర్యాద ఉంటే ఆ ఎమ్మెల్యేను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

గంగా పుష్కరాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..సికింద్రాబాద్ నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి అంటే

ఇంతకీ ఖర్గే ఏమన్నారంటే ? 
కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గదగ్ జిల్లా రాన్‌లో గురువారం నిర్వహించిన బహిరంగ సభకు ఖర్గే హాజరై ప్రసంగించారు. అందులో ప్రధాని న‌రేంద్ర మోడీ విషసర్పం లాంటివారని మండిపడ్డారు. దాన్ని ఎవరు రుచి చూసినా చచ్చిపోతారని చెప్పారు.‘‘ప్రధాని మోడీ విషసర్పం లాంటి వాడు. విషం ఉందా లేదా అని మీరు ఆశ్చర్యపోతారు. కానీ రుచి చూస్తే చచ్చిపోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios