గంగా పుష్కరాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..సికింద్రాబాద్ నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి అంటే
గంగా పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. నేటి నుంచే ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గంగా పుష్కరాల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-వారణాసి మధ్య ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ నాలుగు రైళ్లు ఏప్రిల్ 29, మే 1, 3, 5 తేదీల్లో బయలుదేరుతాయి.
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ?
ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్కాజ్నగర్, బల్హర్షా, నాగ్పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, కట్నీ జంక్షన్, సత్నా, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్ ఛోకీ స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్ల బుకింగ్ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.