రాజస్తాన్‌లో 25 ఏళ్ల యువకుడు తల్లిని దారుణంగా హత్య చేసి చంపేశాడు. కిచెన్‌లోని కత్తితో 80 సార్లకు పైగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. మరణించిన మహిళ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. 

జైపూర్: రాజస్తాన్‌లో దారుణం జరిగింది. కన్న తల్లిని 80 సార్లకు పైనే కత్తితో పొడిచి చంపిన దుర్ఘటన చోటుచేసుకుంది. ఆమె తన తమ్ముడి ఇంటిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు వెళ్లుతాననడమే ఆమె చేసిన నేరం. ఆ పెళ్లికి వెళ్లనేవద్దంటూ కొడుకు వారించి తల్లిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని బిల్వారా జిల్లా పుర్ పట్టణంలో జరిగింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆ యువకుడిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్లారు.

పుర్ ఎస్‌హెచ్‌వో పురన్మల్ మీనా ప్రకారం, ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బిష్నోయి మొహల్లాలోని శంకర్ లాల్ ఇంటిలో జరిగింది. శంకర్ లాల్ మార్కెట్‌కు వెళ్లాడు. భార్య మంజు (46) అదే పట్టణంలోని తమ్ముడి ఇంటికి వెళ్లడానికి బ్యాగ్ సర్దుతున్నది. అదే సమయంలో కొడుకు సునీల్ ఇంటిలోకి వచ్చాడు. ఎటు వెళ్లుతున్నావని తల్లిని అడిగాడు. తన తమ్ముడి ఇంటిలో జరుగుతున్న పెళ్లి వేడుకలో పాల్గొనడానికి వెళ్లుతున్నానని మంజు.. కొడుక్కి సమాధానం ఇచ్చింది.

కానీ, ఆ వేడుకకు వెళ్లొద్దని కొడుకు సునీల్ వారించడు. తాను కచ్చితంగా వెళ్లి తీరాల్సిందేనని తల్లి అన్నది. ఈ రకంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో సునీల్ కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చాడు. తల్లిని పొడిచి చంపేశాడని పోలీసులు తెలిపారు. 

Also Read: స్కూటీపై ఎదురుగా గర్ల్‌ఫ్రెండ్‌.. రొమాన్స్ చేస్తూ రోడ్లపై చక్కర్లు.. ఆ వ్యక్తితో పోలీసులు ఏం చేయించారంటే?

ఈ ఘటన తర్వాత సునీల్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు శుక్రవారం సునీల్‌ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్లినట్టు వివరించాడు. శంకర్ ఒక రైతు. సునీల్ కంప్యూటర్ కోర్సు చదివాడు కానీ, నిరుద్యోగిగానే ఉన్నాడు.

మరణించిన మంజు సోదరుడు వినోద్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి చెల్లి మరణంపై ఫిర్యాదు ఇవ్వగా ఎఫ్ఐఆర్ నమోదైంది.