స్కూటీపై ఎదురుగా గర్ల్‌ఫ్రెండ్‌.. రొమాన్స్ చేస్తూ రోడ్లపై చక్కర్లు.. ఆ వ్యక్తితో పోలీసులు ఏం చేయించారంటే?

ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన గర్ల్‌‌ఫ్రెండ్‌ను స్కూటీపై కూర్చోబెట్టుకుని     అర్ధరాత్రి రోడ్లపై చక్కర్లు కొట్టాడు. గర్ల్‌ఫ్రెండ్‌ను స్కూటీపై ఎదురుగా కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేసుకుంటూ షికారు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు రప్పించి క్షమాపణలు చెప్పించారు. జరిమానా విధించారు.
 

chhattisgarh man romancing with his girlfriend while riding bike, police made him apologise kms

రాయ్‌పూర్: ఓ వ్యక్తి అర్ధరాత్రి తన గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు తీసుకువచ్చాడు. స్కూటీపై ఆమెను ఎదురుగా ముఖం తన వైపు ఉండేలా కూర్చోబెట్టుకున్నాడు. స్కూటీపైనే రొమాన్స్ చేస్తూ రోడ్లపై చక్కర్లు కొట్టారు. వారి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో ఛత్తీస్‌గడ్ పోలీసుల దృష్టికి వచ్చింది.

బిలాస్‌పూర్‌లో బుధవారం రాత్రి 2 గంటలకు ఈ ప్రేమ జంట నడి రోడ్డుపై అలా రొమాన్స్ చేస్తూ షికార్లు చేసింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఇష్టారీతిన తిరిగారు. ఆ సమయంలో పెట్రోలింగ్ పాయింట్లలో పోలీసులు లేరు. అయితే, ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన తర్వాత పోలీసులు ఫోకస్ పెట్టారు. 

ఆ వీడియో ఆధారంగా స్కూటీ నెంబర్ ప్లేట్‌ను చూడగలిగారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా యజమాని వివరాలను సేకరించగలిగామని ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సంజయ్ కుమార్ సాహు తెలిపారు. ఆ యజమానికి ఫోన్  చేసి పోలీసు స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించారు.

ఆ స్కూటీ ఓనర్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. అతడిని పై ఘటన గురించి ప్రశ్నించారు. ఆ స్కూటీ తనదేనని వచ్చిన వ్యక్తి అంగీకరించాడు. కానీ, ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తాను కాదని చెప్పాడు. అది తన మిత్రుడు హర్ష్ తివారీ అని వివరించాడు. పోలీసులు అప్పుడు హర్ష్ తివారీకి ఫోన్ చేసి పోలీసు స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించాడు.

Also Read: పట్టపగలు నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పై రొమాన్స్‌.. వీడియో వైరల్

19 ఏళ్ల హర్ష్ తివారీ కవర్దా నివాసి. తిక్రాపారాలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతను కాలేజీ స్టూడెంట్ అని, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టు విచారణలో వివరించాడు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించినందుకు గాను రూ. 8,800 చాలాన్ వేశారు. అలాగే, భవిష్యత్‌లో మళ్లీ ఇలా నిబంధనలు ఉల్లంఘించబోని హామీ తీసుకున్నారు. అలా నిర్లక్ష్యంగా, హద్దు మీరి రోడ్డుపై ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాడు.

అయితే, పోలీసులు ఆ వ్యక్తితో ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌కు మాత్రం సమన్లు పంపలేదు. ఆమెన విచారించాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios