బిహార్‌కు చెందిన ఓ యువకుడు తన తండ్రిని కత్తితో పదిహేను సార్లు పొడిచి చంపేశాడు. తాగొచ్చి తల్లిని దూషించడం, దాడి చేయడంతో కొడుకు తండ్రిపైనే దారుణంగా దాడి చేసి చంపేశాడు. 

పాట్నా: తండ్రి తరుచూ మద్యం తాగి ఇంటికి వచ్చి నానారభస చేయడం ఆయన కొడుకుకు నచ్చట్లేదు. ముఖ్యంగా తల్లిని దూషించడం, తరుచూ బాదడం కొడుకుకు తండ్రిపి కోపాన్ని పెంచింది. ఓ రోజు ఇలాగే తండ్రి మద్యం మత్తులో తల్లిని కొట్టడం చూసి ఏకైక కొడుకు తన తండ్రిని కత్తితో 15 పోట్లు పొడిచాడు. రక్తం భీకరంగా బయటకు వచ్చింది. తండ్రి అనిల్ కుమార్ మండల్ మరణించాడు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైంది. కొడుకు అర్నబ్ మెహతాతోపాటు తల్లి రీతా దేవీలను పోలీసులు అరెస్టు చేశారు.

బిహార్‌ ముంగేర్ జిల్లా నయాగావ్ ఠాకూర్‌బారి రోడ్డు ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 58 ఏళ్ల అనిల్ కుమార్ మండల్ రైల్వేలో వర్కర్‌. అయితే, అనిల్ కుమార్ మండల్ తరుచూ పూటుగా తాగి వచ్చి తల్లిని విపరీతంగా హింసించేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఇలాగే తన తండ్రి తల్లిని దూషించాడని కొడుకు అర్ణబ్ మెహెతా తెలిపాడు. 

తాను తల్లిని బాదుతున్న తండ్రికి అడ్డుగా వెళ్లాడు. తండ్రిని ఆపే ప్రయత్నం చేశాడని అర్ణబ్ చెప్పాడు. అయితే, తండ్రి తన మీదికే దాడికి రావడంతో ప్రాణ రక్షణ కోసం తాను తండ్రిని చంపేశాడనని నిందితుడు అంగీకరించాడు.

Also Read: ఆర్టీఐ దరఖాస్తుకు 40 వేల పేజీల సమాధానం.. డాక్యుమెంట్లతో నిండిపోయిన SUV, సర్కారుకు రూ. 80 వేల నష్టం

అనిల్ కుమార్ మండల్ సోదరుడు సునీల్ మండల్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. అనిల్, రీతా దేవీలు తరుచూ గొడవ పడేవారన వివరించాడు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో తనకు అరుపులు, కేకలు వినిపించాయని చెప్పాడు. మెట్లు దిగి కిందికి వెళ్లగా అనిల్ కుమార్ మండల్ తీవ్రంగా రక్తం కోల్పోతూ నిస్సహాయ స్థితిలో ఉన్నాడని వివరించాడు.