Asianet News TeluguAsianet News Telugu

పోలీసులకు లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ మధ్య ఎన్ కౌంటర్.. ముఠాలోని నలుగురు సభ్యుల అరెస్ట్ 

లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని నలుగురు సభ్యులను ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో పెద్దఎత్తున ఘాతుకానికి పాల్పడేందుకు అక్రమార్కులు ప్రణాళికలు రచిస్తున్నట్లు రహస్య సమాచారం మేరకు తెలిసిందని పోలీసులు తెలిపారు. వెంటనే జైత్‌పూర్, సర్వైలెన్స్, ఎస్‌ఓజీ, ఎస్‌వాట్ టీమ్ సంయుక్త బృందం తక్షణ చర్యలు చేపట్టి నలుగురు షూటర్‌లను అదుపులోకి తీసుకోవడంలో విజయం సాధించింది.

Three Shooters Of Lawrence Bishnoi Gang Arrested In Agra For Firing In Jaipur G Club
Author
First Published Feb 1, 2023, 6:05 AM IST

లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన నలుగురు షూటర్లను ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలోని జైద్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత భయంకరమైన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జైపూర్‌లోని జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ సమాచారం మేరకు, ఆగ్రా జాయింట్ పోలీసు బృందం.. నిందితులు  జయప్రకాష్, రిషబ్, ప్రదీప్ శుక్లా లను అరెస్టు చేశారు. విచారణలో పోలీసులు వారి నాల్గవ సహచరుడు భూపేంద్ర గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చారు.

దీని తరువాత రంగంలోకి దిగిన పోలీసులు నహ్తౌలీ తిరాహే దుర్గా టెంపుల్ జైత్‌పూర్ సమీపంలో భూపేంద్రను చుట్టుముట్టారు. మోసగాడు భూపేంద్రను లొంగిపోవాలని పోలీసులు కోరగా, అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపి.. చివరకు పోలీసులు భూపేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో భూపేంద్ర నుంచి 3 పిస్టల్స్, 6 మ్యాగజైన్లు, 7 లైవ్ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జయప్రకాష్‌, రిషబ్‌లు రాజస్థాన్‌ వాసులు కాగా, ప్రదీప్‌ శుక్లా, భూపేంద్ర బాహ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారు.

జైపూర్ హోటల్ యజమాని అక్షయ్ గుర్నానీపై కాల్పులు జరిపిన లారెన్స్ విష్ణోయ్ గ్యాంగ్ సభ్యులపై కేసు నమోదైంది. 1 కోటి వసూలు చేయనందుకు హోటల్ నిర్వాహకుడిపై లారెన్స్ విష్ణోయ్ షూటర్లు బుల్లెట్లు పేల్చారు. పంజాబీ సింగర్ సిద్ధు ముసేవాలా హత్యకేసులో లారెన్స్ విష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. కరుడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ కూడా నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్ చేశాడు.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ఎన్‌ఐఏ రిమాండ్ 4 రోజులు పొడిగించింది. పోలీసులు నిందితులను విచారిస్తున్నారని, అరెస్టు చేసిన నలుగురు దుర్మార్గులపై కేసు నమోదు చేసినట్లు ఆగ్రా ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. నిందితులను విచారించిన అనంతరం వారు ఆగ్రాకు రావడానికి గల కారణాలపై సమాచారం సేకరిస్తున్నారు. ఆగ్రా పోలీసులు 
వీరి అరెస్టును పెద్ద విజయంగా భావిస్తున్నారు.

జనవరి 30, 2023న, లారెన్స్ విష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కొందరు షూటర్లు జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వచ్చి ఆగ్రా జిల్లాలో ఏదైనా పెద్ద సంఘటనను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని ఆగ్రా పోలీస్ కమిషనరేట్ బృందాలకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో జైత్‌పూర్, సర్వైలెన్స్, ఎస్‌ఓజీ, ఎస్‌వాట్ టీమ్ సంయుక్త బృందం తక్షణ చర్యలు చేపట్టి.. దాడి చేసి ముగ్గురు షూటర్లను అరెస్టు చేసింది. ఎన్‌కౌంటర్ తర్వాత నాలుగోవాడు పట్టుబడ్డాడు

Follow Us:
Download App:
  • android
  • ios