chennai floods : ప్రకృతి గీసిన చిత్రం.. వరద నీటిలో జనం కష్టాలు, జాగ్రత్తగా గమనిస్తే అందులో ఓ వ్యక్తి ఫోటో

సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ రోడ్డుపై వరద నీరు పోటెత్తుతూ వుండగా.. అందులో కార్లు కొట్టుకుపోతున్నాయి. జనం నడుము లోతు నీటిలోనే ముందుకు వెళ్తూ తమ కార్లు, వాహనాలు, వస్తువులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. అయితే ఆ ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే.. ఓ వ్యక్తి ముఖం కనిపిస్తుంది. 

some portrait drawn by nature during chennai floods photo goes viral ksp

మిచౌంగ్‌ తుఫాన్‌ అటు తమిళనాడు, ఇటు ఏపీ రాష్ట్రాలను అతలా కుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తుఫానుకి సంబంధించిన వరదల్లో సాధారణ ప్రజలు మాత్రమే కాదు, సెలబ్రిటీలు బాధితులుగా మారుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ ఫెక్ట్ అమీర్‌ ఖాన్, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సహా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. పవర్‌ లేదు, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి. వైఫై లేదు. తమ సమాచారం అందించలేని స్థితి. చెన్నై నగరం ఇంకా నీటిలోనే వుంది. 

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ రోడ్డుపై వరద నీరు పోటెత్తుతూ వుండగా.. అందులో కార్లు కొట్టుకుపోతున్నాయి. జనం నడుము లోతు నీటిలోనే ముందుకు వెళ్తూ తమ కార్లు, వాహనాలు, వస్తువులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. అయితే ఆ ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే.. ఓ వ్యక్తి ముఖం కనిపిస్తుంది. అది ఎవరిదో కాదు.. తమిళనాడు సీఎం , డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ది. ఇది యావరో కావాలని చేసింది కాదు.. యాధృచ్చికంగా జరిగింది. ప్రకృతి చేసే వింతలు అప్పుడప్పుడు జనాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వుంటాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. 

 

 

మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో వున్న ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వందలాది మంది అక్కడే తలదాచుకుంటున్నారు. కార్లు, ఇతర వాహనాలు నీటిలోనే మునిగి వుండగా, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దుకాణాలు, ఇతర వాణిజ్య కార్యాలయాలు నీటిలోనే నానుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios