మణిపూర్ లో ఇండియన్ ఆర్మీ శాశ్వతంగా శాంతిని నెలకొల్పలేదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. మణిపూర్ సమస్యకు బుల్లెట్ల నుంచి కాకుండా హృదయం నుంచి పరిష్కారం రావాలని చెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరైనవి కావని తెలిపారు.

మణిపూర్ లో ఇండియన్ ఆర్మీ రెండు రోజుల్లో శాంతిని పునరుద్దరించగలుతుుందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. మణిపూర్ లో భారత సైన్యం దేనినీ పరిష్కరించజాలదని, 100 రోజులకు పైగా కొనసాగుతున్న జాతి హింసకు పరిష్కారం బుల్లెట్ల నుంచి కాకుండా హృదయం నుంచి రావాలని తెలిపారు. 

అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రంలో రెండు రోజుల్లో సైన్యం అల్లర్లను రాహుల్ గాంధీ సూచించారని, అయితే ఆయన పౌరులపై కాల్పులు జరపాలని ఆర్మీకి సూచిస్తున్నారా అని శర్మ ప్రశ్నించారు. ‘‘ ఐజ్వాల్ లో భారత వైమానిక దళం ఆ పని చేసింది. వారు బాంబులు పేల్చారు. హింస తగ్గుముఖం పట్టింది. ఈ రోజు రాహుల్ గాంధీ భారత సైన్యం హింసను అణచివేయాలని అంటున్నారు. అంటే ఏమిటి? పౌరులపై కాల్పులు జరపాలా? ఇది ఆయన ఎలా చెబుతున్నాడు. సైన్యం దేనినీ శాస్వతంగా పరిష్కరించదు. వారు తాత్కాలికంగా మాత్రమే శాంతిని నెలకొల్పుతారు. కానీ పరిష్కారమన్నది హృదయం నుంచి రావాలి తప్ప బుల్లెట్ల నుంచి కాదు’’ అని ఆయన గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Scroll to load tweet…

ఈ అంశంపై ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు మొదట డిమాండ్ చేశాయని, ఆ తర్వాత లోక్ సభలో ప్రధాని మోదీ రెండు గంటలకు పైగా ప్రసగించారని హిమంత బిశ్వ శర్మ అన్నారు. కానీ ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే ప్రతిపక్ష నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారని, ఇది వారి కుట్రలను పూర్తిగా బహిర్గతం చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షాల ఉద్దేశం పార్లమెంటును స్తంభింపజేయాలని మాత్రమే అన్నారు. ‘‘మణిపూర్ విషయంలో పార్లమెంటు లోపల హంగామాను లేవనెత్తాలనుకున్నారు. కానీ అది మణిపూర్ పై ప్రేమ కాదు. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే’’ అని అన్నారు. 

మణిపూర్ గురించి ప్రధాని మోడీ తన హృదయం నుండి, ఈశాన్య రాష్ట్రాల కోసం 2 గంటల 20 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో చేశారని శర్మ అన్నారు. ‘‘ ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము, ప్రతిపక్షాలు సంతోషంగా ఉండవు. ప్రధాన పార్టీగా ప్రతిపక్షాలు చివరి వరకు ప్రధాని ప్రసంగాన్ని వినాలని ఆకాంక్షించారు.’’ అన్నారు.