కూతురి వీడియో తీసి పోస్టు చేయడాన్ని వ్యతిరేకించిన జవాన్‌పై మూకదాడి.. సైనికుడి మృతి.. గుజరాత్‌లో ఘటన
గుజరాత్‌లో ఓ సైనికుడిపై మూక దాడి జరిగింది. ఈ మూక దాడిలో జవాన్ మరణించాడు. తన కూతురి అసభ్య వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన బాలుడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీయగా.. గొడవ జరిగినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఓ జవాన్ పై మూక దాడి జరిగింది. ఈ మూక దాడిలో అతను మరణించాడు. తాను చేసిందల్లా కేవలం తన బిడ్డకు చెందిన ఓ అసభ్య వీడియోను ఇంటర్నెట్‌లో వైరల్ చేయడాన్ని వ్యతిరేకించడమే. ఈ ఘటన నదియాడ్‌లోని చక్లాసి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైంది.
జవాన్ కూతురు, ఓ బాలుడు సఖ్యంగా మెలిగేవారు. వారిద్దరూ ఒకే స్కూల్‌లో చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ బాలికకు సంబంధించిన ఓ అసభ్య వీడియోను బాలుడు తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ విషయం జవాను కుటుంబానికి తెలిసింది.
తన కూతురి వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టు చేసి సర్క్యులేట్ చేస్తున్న 15 ఏళ్ల అబ్బాయి ఇంటికి ఆ జవాన్ వెళ్లాడు. జవాన్ కుటుంబం కూడా వెంట వెళ్లినట్టు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లోని కొన్ని వర్గాలు ధ్రువీకరించాయి. జవాన్‌తోపాటు జవాన్ భార్య, వారి ఇద్దరు కొడుకులు, మరో బంధువు వెళ్లారు. ఈ పనిని చెబుతూ అబ్బాయిని నిలదీశాడు. కానీ, అబ్బాయి కుటుంబం జవాన్ కుటుంబంపైనే ఎదురుదాడికి దిగింది. జవాన్ కుటుంబంపైనే వారు దూషణలకు దిగారు. ఈ దూషణలను జవాన్ అడ్డగించే ప్రయత్నం చేశాడు. దీంతో దాడి జరిగింది. అక్కడ ఆ గ్రూపు మొత్తం వీరిపై దాడికి తెగబడింది. ఈ దాడిలో జవాన్ మరణించాడు.
Also Read: పాకిస్తాన్ డ్రోన్ కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు.. 4.3 కిలోల హెరాయిన్ స్వాధీనం
ఈ ఘటనపై కేసు నమోదైనట్టు శనివారం రాత్రి ఓ పోలీసు తెలిపారు. అబ్బాయి కుటుంబం దూషణలను అడ్డగించడానికి జవాన్ ప్రయత్నించాడని, ఆ ఫ్యామిలీ.. జవాన్ కుటుంబంపై దాడికి దిగిందని ఎఫ్ఐఆర్ పేర్కొంది.