Asianet News TeluguAsianet News Telugu

Solar eclipse 2022 : ఈ యేడాది పాక్షిక సూర్యగ్రహణం.. ఎప్పుడంటే..

భారత్ లో గ్రహణం సమయంలో బైటికి వెళ్లరు. ఎలాంటి ఆహారాలు తీసుకోరు. అలా చేయడం వల్ల గ్రహణం చెడు ప్రభావం తమ మీద పడకుండా ఉంటుందని నమ్ముతారు. 

Solar eclipse 2022 date : Next Surya Grahan on Diwali, check India timings
Author
First Published Oct 8, 2022, 7:15 AM IST

ఢిల్లీ : ఈ సారి సూర్య గ్రహణం 2022 ఈ నెలలోనే రానుంది. ఈ సారి రానున్న సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అది అక్టోబర్ 22, మంగళవారంనాడు రానుంది. దేశంలో అతి పెద్ద, ముఖ్యమైన పండుగల్లో ఒకటైన దీపావళికి ఒక రోజు ముందు ఇది రానుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం ఐరోపా, దక్షిణ, పశ్చిమ ఆసియా, ఉత్తర, తూర్పు ఆఫ్రికా, అట్లాంటిక్‌ లలో కనిపిస్తుంది.

భారతీయ కాలమానం ప్రకారం.. సూర్య గ్రహణం..
timeanddate.com వెబ్‌సైట్ ప్రకారం, ఈ పాక్షిక సూర్యగ్రహణం న్యూఢిల్లీలో కనిపిస్తుంది. ఇది స్థానిక సమయం 16:29:10కి ప్రారంభమవుతుంది, ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని మూసేయడం మొదలవుతుంది. గ్రహణం 18:26:03కి ముగుస్తుంది.

Lunar Eclipse 2022: బ్లడ్ సూపర్ మూన్ చంద్రగ్రహణాన్ని ఇలా చూసేయొచ్చు..

పాక్షిక గ్రహణం అంటే ఏమిటి?
పాక్షిక సూర్యగ్రహణాన్ని ఆంషిక్ సూర్య గ్రహణం అని కూడా అంటారు. సంపూర్ణ గ్రహణంలో సూర్యుడు పూర్తిగా చంద్రునితో కప్పబడుతుంది. అదే పాక్షిక, కంకణాకార గ్రహణాలలో, సూర్యుని కొంత భాగం మాత్రమే చంద్రుడితో ఓవర్ లాప్ అవుతుంది.

సూర్యగ్రహణం సమయంలో చేయవలసినవి, చేయకూడనివి...
దేశంలో, ప్రజలు సాధారణంగా గ్రహణం లేదా గ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోరు. అంతేకాదు, గ్రహణం చెడు ప్రభావాలను నివారించడానికి దర్భ గడ్డి లేదా తులసి ఆకులను తినుబండారాలు, నీళ్లలో వేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలని నమ్ముతారు.

ఇక మరికొందరు గ్రహణం సమయంలో సూర్య భగవానుడి మంత్రాలను చదువుకుంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే గ్రహణ కిరణాలు పడకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వీరు ఆ సమయంలో సంతాన గోపాల మంత్రాన్ని జపించాలని పెద్దలు చెబుతారు. ఇక చాలా మంది గ్రహణ సమయంలో పచ్చి గంగ కూడా ముట్టరు. 

అలాగే, గ్రహణ సమయంలో ఆహారాన్ని తయారు చేయడం లేదా తినడం నిషేధించబడింది. ఇక శుభకార్యాల విషయానికి వస్తే.. గ్రహణ సమయంలో వీటిని అస్సలు మొదలుపెట్టరు. 

(గమనిక: గ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా కంటితో చూడడం వల్ల ఆ కిరణాల ప్రభావంతో కంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ సేపు చూడడం వల్ల కంటికి శాశ్వత నష్టం కలిగించి అంధత్వానికి దారి తీస్తుంది)

Follow Us:
Download App:
  • android
  • ios