న్యూఢిల్లీ:కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతే పాఠశాలలు పున: ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పోఖ్రియాల్ చెప్పారు. 

శుక్రవారం నాడు పలు పాఠశాలల ఉపాధ్యాయులతో వీడియో కాన్పరెన్స్ లో మంత్రి పొఖ్రియాల్ పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడే స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరిచే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతే పాఠశాలలు పున:ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.

లాక్‌డౌన్ తర్వాత అనుసరించాల్సిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలిపారు. ఆన్ లైన్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా పాఠాలు బోధించడం అలవాటు చేసుకోవాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు నష్టపోకుండా సిలబస్ ను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

మరో వైపు సెప్టెంబర్ 1వ తేదీ నుండి విశ్వవిద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా ప్రకటించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ 1 నుండి విశ్వవిద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని సూచించింది. 

also read::ఎలా ఆపగలం: వలస కార్మికులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత 50 శాతం మంది విద్యార్థులతో ప్రాథమికంగా పాఠశాలలు ప్రారంభించించనున్నట్టుగా మంత్రి తేల్చి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  వీలుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు.

also read:విద్యార్థులకు గుడ్‌న్యూస్: 10, 12 తరగతుల పరీక్షలు రద్దు, మార్కులిలా....

కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు కూడ వాయిదా పడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో వార్షిక పరీక్షలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. కొన్ని రాష్ట్రాలు వార్షిక పరీక్షలను రద్దు చేశాయి.