Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 18 మంది మృతి.. నిలిచిన విద్యుత్ సరఫరా.. అంధకారంలో 7 లక్షల మంది

అమెరికాలో తుఫాను కొనసాగుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చల్ల గాలులు వీస్తుండటంతో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ వాతావరణ పరిస్థితి వల్ల ఆ దేశ వ్యాప్తంగా 18 మంది మరణించారు. 

Snow storm in America.. 18 people died.. Power supply stopped.. 7 lakh people in darkness
Author
First Published Dec 25, 2022, 8:58 AM IST

అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడంతో 48 రాష్ట్రాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. విపరీతమైన చల్లగాలులు వీస్తుండటంతో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం మాదిరిగానే మంచు కురుస్తుండటంతో విద్యుత్ సౌకర్యానికి కూడా అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 7 లక్షల మంది అంధకారంలోనే ఉండిపోయారు.

కరోనాను ఎదుర్కోవడానికి సన్నాహాలు.. డిసెంబర్ 27 న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్

రోడ్లపై ఘోరంగా మంచు పేరుకుపోతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కూడా అనేక మంది మరణిస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితి వల్ల ఈ వీకెండ్ లో అనేక విమానాలను రద్దు చేశారు. దీంతో అనేక మంది విమానాల్లోనే చిక్కుకుపోయారు. ఆర్కిటిక్ పేలుడు ఫలితంగా యుఎస్‌లోని అప్పర్ మిడ్‌వెస్ట్, ఇంటీరియర్ ఈశాన్య ప్రాంతాల నివాసితులకు ఈ శీతాకాలం 'హ్యాపీ హాలిడే' సీజన్ కాకుండాపోయింది. యూస్ లో తుఫాను విజృంభిస్తోందని, ప్రజలంతా ఇప్పటికీ భారీ మంచు తుఫాను పరిస్థితులను చూస్తున్నారని వార్తా సంస్థ ‘సీఎన్ఎన్’ నివేదించింది. 

ఈ తుఫాను కారణంగా బలమైన శీతల గాలులు వీస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల వల్ల రక్తం గడ్డకట్టే పరిస్థితులకు నెలకొన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ లలోకి చేరుకున్నాయి. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో హీటింగ్ పరికరాలు పని చేయడం లేదు. దీంతో చలిని ఎదుర్కోవడం అమెరికా వాసులకు కష్టంగా మారింది.

జన గణనలో ఓబీసీ గణన.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు..

ఈ భారీ హిమపాతం, బలమైన గాలులు న్యూయార్క్‌లోని బఫెలోలో ప్రజల జీవితాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. కొన్ని చోట్ల గాలి వేగం గంటకు 60 మైళ్ల కంటే ఎక్కువగానే ఉంది. బఫెలోలోని కొన్ని ప్రాంతాలలో 2 అడుగుల కంటే ఎక్కువ మంచు కురిసింది. శనివారం ఉష్ణోగ్రతలు సున్నా-డిగ్రీ మార్కు కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. మంచు తుఫాను వంటి పరిస్థితులు కనీసం ఆదివారం కూడా కొనసాగుతాయని వాతావరణ నివేదికలు వెల్లడించాయి. 

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తమ కార్లను రోడ్డుపైకి తీసుకెళ్లవద్దని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న కొద్ది రోజుల్లో దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఇంకా తీవ్రమైన పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఆర్కిటిక్ మహాసముద్రంలో పేలుడు కారణంగా పరిస్థితి మరింత దిగజారవచ్చని అంచనా వేసింది. ఈ తుఫానుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రజలను హెచ్చరించారు.‘‘ నువ్వు చిన్నప్పుడు సరదాగా ఆడుకున్న మంచు కురిసే రోజు కాదు ఇది. పరిస్థితి చాలా భయానకంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి.’’ అని సూచించారు.

మానవత్వం దాటుకున్న భారత సైన్యం! కొండ ప్రాంతంలో కారు ప్రమాదం.. క్షతగాత్రులను రక్షించిన ఆర్మీ..

ఈ మంచు తుఫాను కారణంగా క్రిస్మస్ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో దాదాపు 200 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుపోయారు. విమానాల నుంచి రైళ్లు, ఆటోమొబైల్స్ వరకు అన్ని సేవలు నిలిచిపోయాయి. న్యూయార్క్ లో అయితే ఈ సారి క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తుఫాను పరిస్థితుల్లో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios