యోవికా చౌదరి అనే టీచర్ పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె ఐఫోన్‌ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కిందపడిన ఆమెను కొద్దిదూరం అలాగే లాక్కెళ్లారు. 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఐఫోన్ కొట్టేయడానికి ప్రయత్నించిన బైకర్లు చేసిన దారుణానికి ఓ మహిళ తీవ్ర గాయాలపాలయ్యింది. కాస్తలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెడితే...

ఓ మహిళా టీచర్‌ ఆటోలో వెడుతోంది. ఆమె దగ్గర ఐఫోన్ ఉండడం గమనించారు ఇద్దరు బైకర్లు. దీంతో ఆమె మొబైల్‌ ఫోన్‌ లాక్కునే ప్రయత్నంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు..ఆమెను ఆటోలోంచి కిందికి లాగి, రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం ఢిల్లీలో చోటుచేసుకుంది.

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి.. గోలీసోడా అమ్ముతూ నెలకు లక్షల్లో సంపాదన.. తుల రంగనాథ్ సక్సెస్ స్టోరీ

బాధితురాలు యోవికా చౌదరి. ఆమె ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. సాకేత్‌లోని జ్ఞాన్‌ భారతి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె దగ్గర ఐఫోన్ ఉంది. దీన్ని ఇద్దరు దుండగులు గమనించారు. శుక్రవారం స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె ఐఫోన్‌ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. 

ఆ సమయంలో ఆటోలో వెడుతున్న ఆమె.. అందులోంచి కిందపడింది. అయినా వదలకుండా అలాగే చాలా దూరం ఈడ్చుకెళ్లారు. చివరికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఫోన్ వదిలేసింది. స్నాచర్లు ఆ ఫోన్‌తో పారిపోయారు. 

చౌదరిని చూసిన స్థానికులు వెంటనే మాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ముక్కు పగిలిందని, ఇతర గాయాలకు చికిత్స పొందింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. స్నాచర్లపై సాకేత్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.