Asianet News TeluguAsianet News Telugu

రూ. 30 కోట్ల విలువైన రెండున్నర కేజీల పాము విషం స్మగ్లింగ్..ఎక్కడంటే..

రెండున్నర కేజీల పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పశ్చిమబెంగాల్ అధికారులు పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. 

Smuggling of two and half kgs snake venom worth rs.30 crores caught in West Bengal
Author
First Published Oct 17, 2022, 8:31 AM IST

పశ్చిమ బెంగాల్ : పాము కనిపిస్తే అల్లంత దూరం పరిగెడతాం.. అయితే కొంతమంది మాత్రం ఆ పాములను, వాటికి రక్షణగా ఉండే విషాన్ని కూడా వదలడం లేదు. వాటినీ స్మగ్లింగ్ చేస్తున్నారు. అలా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో అధికారులు భారీ ఎత్తున పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు జరిపిన అటవీ అధికారులు శనివారం రాత్రి రెండున్నర కేజీల విషాన్ని గుర్తించారు. ఈ విషాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

నిందితుడు మహమ్మద్ సరాఫత్ గా గుర్తించినట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని ఖురాయి ప్రాంతంలో ఇతడు నివసిస్తున్నట్లు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాము విషం రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా..  ఆ తర్వాత నిందితుడిని పోలీసులు విచారించగా పాము విషం  ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి వచ్చిందని చెప్పాడు. ఈ విషయాన్ని అతను నేపాల్ కు తీసుకు వెళ్తున్నట్లు వివరించాడు. నేపాల్ నుంచి చైనాకు తీసుకువెళ్లాలని అతని వ్యూహంగా తెలిసింది.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి.. ఇంకో పావుగంటలో ఇల్లు చేరతామనగా.. కబలించిన మృత్యువు..

ఇదిలా ఉండగా, నిరుడు మార్చిలో ఇలాంటి ఘటనే ఒడిశాలో చోటు చేసుకుంది. ప్రమాదకర పాముల్లోని విషాన్నిసేకరించి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠాను ఒడిషాలో పట్టుకున్నారు. దాదాపు 200కు పైగా కోబ్రాల నుండి సేకరించిన లీటర్ విషాన్ని ఓ ముఠా గుట్టుగా తరలిస్తుంది. ఈ స్మగ్లర్లను భువనేశ్వర్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషం విలువ దాదాపు కోటి రూపాయల వరకు వుంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పాముల విషాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఈ ముఠాలో ఓ మహిళ కూడా వుంది. 

ఈ వ్యవహారానికి సంబంధించి డిస్ట్రిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ మిశ్రా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ''ఒక లీటర్ పాము విషాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా కొంతమందిని మేము పట్టుకున్నాం. ఈ విషాన్ని ఐదు మిల్లీలీటర్ల చిన్న చిన్న బాటిల్స్ లో నింపి స్మగ్లింగ్ చేస్తున్నారు. ముగ్గురు పురుషులు, ఓ మహిళ కలిసి విషాన్ని సేకరించి కొనుగోలుదారులతో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఈ విషయంపై తమకు పక్కా సమాచారం అందడంతో దాడి చేశామని, వారి వద్దనుంచి ఈ విషాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బహిరంగ మార్కెట్ లో ఈ విషం విలువ కోటి రూపాయల వరకు వుంటుంది'' అని పేర్కొన్నారు. 

''దాదాపు 200 కోబ్రాల నుండి ఈ విషాన్ని సేకరించి వుంటారు. విషం స్మగ్లింగ్ తో సంబంధమున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. వారిపై జంతు సంరక్షణ యాక్ట్ ప్రకారం 9, 39, 44, 49.. 51 సెక్షన్ల  కింద కేసులు నమోదు చేశాం. అరెస్టయిన వారిని కోర్టుముందు ప్రవేశపెడతాం'' అని అటవీశాఖ అధికారి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios