Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి.. ఇంకో పావుగంటలో ఇల్లు చేరతామనగా.. కబలించిన మృత్యువు..

దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఇంకో పావుగంటలో ఇల్లు చేరతామని అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఎదురుగా వచ్చిన పాలవ్యాన్ వాళ్ల పాలిట మృత్యు శకటంగా మారింది. 

road accident in karnataka, 9 died
Author
First Published Oct 17, 2022, 7:13 AM IST

కర్ణాటక : కర్ణాటకలోని హసన జిల్లాలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు.  14 మంది గాయపడ్డారు. హళ్లికెరెకు చెందిన 14 మంది ట్రావెలర్ ను అద్దెకు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లారు. హసనకు చేరుకుని హసనాంబ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మరో పావుగంటలో స్వగ్రామం చేరుకోవాల్సి ఉండగా జాతీయ రహదారి-69పై ఎదురుగా వచ్చిన పాల టాంకర్, టెంపో ట్రావెలర్ ను ఢీకొట్టింది.

వెనక వస్తున్న బస్సు.. ముందు ఢీకొట్టిన ట్యాంకర్ల మధ్య టెంపో ట్రావెలర్ నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో హళ్లికెరె గ్రామానికి  చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. మృతులంతా సన్నిహిత బంధువులు. బస్సులో ఉన్నవారితో పాటు మొత్తం 14 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు రెండు లక్షల పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి బొమ్మై అధికారులను ఆదేశించారు.

ముంబైలోని ముంబ్రా గోదాములో భారీ అగ్నిప్రమాదం

ఇదిలా ఉండగా, ఈ నెల 12న బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీహార్‌లోని చప్రా-సివాన్ హైవేపై అక్టోబర్ 12వ తేదీ ఉదయం పోలీసులతో వెళ్తున్న బస్సు ఢీకొనడంతో ముగ్గురు బైకర్లు మృతి చెందారు. వివరాల్లోకి వెడితే.. పోలీసు సిబ్బందితో వెడుతున్న బస్సు బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన చప్రా సివాన్ హైవేపై చోటు చేసుకుంది. ఆ బస్సులో బీహార్  పోలీస్ సిబ్బంది  ఉన్నారు. ఆ బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీకొనడంతో.. వారిలో ఒకరు బైక్ తో సహా బస్సు కింద ఇరుక్కుపోయారు. 

దీంతో ఒక్కసారిగా ఇంధన ట్యాంకు పేలింది. అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఆ ముగ్గురు వ్యక్తులు బస్సు కిందికి రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో బస్సు కింద ఇరుక్కున్న బైకర్ తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.  బస్సులో మంటలు చెలరేగడంతో పోలీసు అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సితాబ్దియారాలో దివంగత రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ 120వ జయంతి వేడుకల్లో పాల్గొని పోలీస్ సిబ్బంది తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

బస్సు ఢీ కొన్న తరువాత బైకర్లలో ఒకరు బస్సు కింద ఇరుక్కుని,  సుమారు 90 మీటర్ల వరకు ఈడ్చుకు పోబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఈ విషాద వార్త అందర్నీ కలిచి వేస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios