Parliament Monsoon Session: మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలు చేయటంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. మీకు దమ్ముంటే ఇవి రాజస్థాన్, బీహార్ ఘటనలపై మాట్లాడాలంటూ.. ప్రతిపక్షాల ఎంపీలకు కౌంటర్ విసిరారు స్మృతి ఇరానీ.
Parliament Monsoon Session: మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా.. అందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విపక్షాలకు దీటుగా బదులిస్తోంది. రాజ్యసభలో విపక్షాలను నిలదీశారు. దమ్ముంటే.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై చర్చించాలని మండిపడ్డారు. ఇలాంటి ఘటనపై మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు ఎప్పుడు వస్తుందని రాజ్యసభలో ప్రశ్నించారు. నిజానికి.. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మణిపూర్‌పై మంత్రి మాట్లాడతారా అని కాంగ్రెస్ నాయకుడు అమీ యాగ్నిక్ ప్రశ్నించారు.
'రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లపై ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడతాయి'
దీని తర్వాత కాంగ్రెస్ ఎంపీ ప్రకటనపై స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా మంత్రులు, మహిళా నేతలు మణిపూర్‌పైనే కాకుండా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లపై కూడా మాట్లాడినందున నేను దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని ఆమె అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల గురించి చర్చించే ధైర్యం ఎప్పుడు ఉంటుందో, బీహార్‌లో ఏమి జరుగుతుందో చర్చించే ధైర్యం ఎప్పుడు చూపిస్తారో చెప్పండని విరుచుకపడ్డారు. అదే సమయంలో రాహుల్ గాంధీపై కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలను ఎలా హింసిస్తున్నారో చెప్పే ధైర్యం రాహుల్ గాంధీకి ఎప్పుడు వస్తుందని అన్నారు.
మణిపూర్ అంశంపై పార్లమెంటులో గందరగోళం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మణిపూర్ అంశంపై పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై చర్చ జరగాలని అధికార బీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లకు మద్దతుగా ఇరు పార్టీల సభ్యులు పలుమార్లు వాయిదా నోటీసులు కూడా ఇచ్చారు.
