జమ్మూలో ఆరుగురు ఉగ్రవాదుల కాల్చివేత

Six terrorists killed, major infiltration attempt foiled by security forces in Kashmir’s Kupwara
Highlights

పాక్ ఉగ్రవాదులకు బుద్ది చెప్పిన భారత్ భద్రతా దళాలు


న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో  ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలకు మద్య ఆదివారం నాడు జరిగిన  కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. 
కాశ్మీర్‌లోని కుపర్వా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట  పాక్ తీవ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. 


ఈ విషయాన్ని పసిగట్టిన  భారత భద్రతా దళాలు  ఉగ్రవాదులపై కాల్పులకు దిగాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి. దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఆరుగురిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరికొందరికి కోసం  గాలింపు చర్యలు చేపట్టినట్టుగా భద్రతా దళాలు ప్రకటించాయి.


 కశ్మీర్‌ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని అయినా కొంతమంది యువకులు తీవ్రవాదం అడుగులేస్తున్నారని ఆర్మీ మాజీ బ్రిగేడియర్‌ అనిల్‌ గుప్తా చెప్పారు.

loader