భారీ ఎత్తున ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టిన భారత సైన్యం ఇవాళ జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌లో మరో ఆరుగురు తీవ్రవాదులను అంతం చేసింది. ఈ తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌భేరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ నేపథ్యంలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. కొద్దిరోజుల క్రితం షోపియాన్ జిల్లాలో జిరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.