Road Accident: ప్రధాని మోడీ ర్యాలీ డ్యూటీకి వెళ్లుతుండగా ఆరుగురు పోలీసులు దుర్మరణం

రాజస్తాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మరణించారు. వారంతా ప్రధాని మోడీ ర్యాలీలో విధులో నిర్వర్తించడానికి బయల్దేరారు. ఈ దుర్ఘటన ఆదివారం ఉదయం 5.30 గంటలకు జాతీయ రహదారి 58 పై జరిగింది.
 

six policemen died in accident while they were going to duty at pm modi rally in rajasthan kms

జైపూర్: ఏ పెద్ద ప్రోగ్రామ్ జరిగినా.. పెద్ద నాయకుడి ర్యాలీ తీసినా పోలీసులు తప్పకుండా ఉండాల్సిందే. పోలీసుల బందోబస్తు లేకుండా రాజకీయ నాయకుల ర్యాలీలు, బహిరంగ సభలు జరగనే జరగవు. రాజస్తాన్‌లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ర్యాలీ బందోబస్తు కోసం పోలీసులకు షెడ్యూల్ అలాట్ అయింది. ప్రధాని ర్యాలీ బందోబస్తు డ్యూటీ కోసం బయల్దేరిన పోలీసులు అందని దూరాలకు వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదం కావడంతో ఆరుగురు పోలీసులు మరణించారు. రాజస్తాన్‌లోని చురు జిల్లాలో జాతీయ రహదారి 58పై ఆదివారం ఉదయమే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

నాగౌర జిల్లాలోని ఖిన్సవార్ పోలీసు స్టేషన్ నుంచి ఆరుగురు పోలీసులు, మహిళా పోలీసు స్టేషన్ నుంచి మరో పోలీసులకు డ్యూటీ అలాట్ అయింది. వీరంతా ఝున్‌ఝునులో నిర్వహిస్తున్న ప్రధాని కార్యక్రమంలో విధులు నిర్వర్తించడానికి జైలో ఎస్‌యూవీలో బయల్దేరారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ వాహనం ఉదయం 5.30 గంటలకు ఓ ట్రక్కును ఢీకొంది. వాహనం ముందు భాగమంతా ధ్వంసమైపోయింది. లోపల ఉన్నవారు బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది.

Also Read: Team India: తొలిసారి బీజేపీతో ఏకీభవించిన కాంగ్రెస్.. ఇంతకీ అవి ఏమన్నాయో తెలుసా?

ఈ ఘటనపై డీజీపీ ఉమేశ్ మిశ్రా దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. పోలీసులు రామచంద్ర, కుంభారం, తానారాం, లక్ష్మణ్ సింగ్, సురేశ్‌లు మరణించారని తెలిపారు. కానిస్టేబుల్ సుఖ్రాం, హెడ్ కానిస్టేబుల్ సుఖ్రాంలు తీవ్రంగా గాయడ్డరాని, వారిని నాగౌర్‌లోని జేఎల్ఎన్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత వారిద్దరినీ జోధ్‌పూర్ ఎండీఎం హాస్పిటల్‌కు తరలించారని, కానీ, మార్గం మధ్యలోనే కానిస్టేబుల్ సుఖ్రాం మరణించారని వివరించారు.

ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. మృతుల  కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios