కరోనాతో దెబ్బ: ఒకే ఇంట్లో ఆరుగురు మృతి, తల్లీ, ఐదుగురు కొడుకులు డెత్

కరోనాతో ఒకే ఇంట్లో ఆరుగురు మరణించారు. రాంచీకి 150 కి.మీ. దూరంలోని ధన్ బాద్ కత్రాస్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.

Six people from same family die of COVID-19; five sons succumb to coronavirus one-by-one after mother


రాంచీ: కరోనాతో ఒకే ఇంట్లో ఆరుగురు మరణించారు. రాంచీకి 150 కి.మీ. దూరంలోని ధన్ బాద్ కత్రాస్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.

88 ఏళ్ల వృద్దురాలు నీలం నర్సింగ్ హోమ్ లో మరణించింది. మరణించిన తర్వాత ఆమెకు కరోనా ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఆమె ఐదుగురు కుమారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  ఈ మహిళ ఐదో కొడుకు రాజేంద్ర ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 25వ తేదీన మరణించాడు.

also read:ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు కరోనాతో మృతి

రిమ్స్ లో చేరకముందు ఆయన ధన్ బాద్ లోని పాటలీపుత్ర మెడికల్ కాలేజీ లో చేరాడు. 88 ఏళ్ల మహిళ తన ఓ కొడుకుతో కలిసి ఢిల్లీలో ఉంటుంది. తన మనమడి పెళ్లి కోసం ఆమె ఢిల్లీ నుండి జార్ఖండ్ కు వచ్చింది. ఈ సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో బొకారోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఈ నెల 4వ ఆమె మరణించారు. 

అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఆమెకు కరోనా సోకినట్టుగా తేలింది. ఆమె ఐదుగురు కొడుకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారంతా 60 నుండి 70 ఏళ్ల మధ్య ఉన్నారు. వీరంతా కరోనా బారిన పడి మరణించారు. జూలై 11న వృద్దురాలి పెద్ద కొడుకు, జూలై 12న రెండో కొడుకు మరణించాడు. జూలై 13న మూడో కొడుకు మరణించాడు. నాలుగో కొడుకు కూడ రాంచీలోని రిమ్స్ లో మరణించాడు. ఈ నెల 25వ తేదీన ఆమె ఐదో కొడుకు మరణించాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios