నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు, కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు కరోనాతో గురువారంనాడు మరణించాడు. కరోనా సోకిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవలనే కోలుకొన్నాడు.

కరోనా సోకిన వెంకటేశ్వర్లు హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం నాడు తెల్లవారుజామున ఆయన మరణించినట్టుగా కుటుంబసభ్యులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చురకుగా పాల్గొనేవారు.

 విద్యార్ధి, కార్మిక విభాగాల్లో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. ప్రజలకు ఆయన సేవ చేసేవాడని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేసుకొన్నారు. వెంకటేశ్వర్లు మరణం తనకు తీరని లోటని ఎంపీ డి. శ్రీనివాస్ తెలిపారు.ఇదే జిల్లాకు చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కూడ కరోనా సోకింది.ఆయన కూడ కరోనా నుండి కోలుకొన్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నరేందర్ యాదవ్ ఈ నెల 13వ తేదీన కరోనాతో మరణించాడు. దీంతో గాంధీభవన్ ను శానిటేషన్  చేసి వారం రోజుల పాటు మూసివేశారు. అయితే తాజాగా మరో కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు మరణించాడు.కాంగ్రెస్ పార్టీ నేతలు వి. హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డిలు కరోనా నుండి కోలుకొన్నారు.