ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం..
గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దాహోద్-అలీరాజ్‌పూర్ హైవేపై ఆటో, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు.
గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దాహోద్-అలీరాజ్‌పూర్ హైవేపై ఆటో, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని.. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి తెలియాల్సి ఉంది.