నజ్రుద్దీన్ పిన్ని షర్మిల బేగం (48) భర్త అజారుద్దీన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో మంత్రగాడిని సంప్రదించగా నరబలి ఇస్తే అంతా చక్కబడుతుందని సలహా ఇచ్చాడు. దీంతో Shalika ఆరు నెలల కుమార్తెను షర్మిల బేగం నీటి తొట్టెలో పడేసి చంపేసినట్లు విచారణలో వెల్లడైంది.
చెన్నై : తంజావూరు జిల్లాలో మూఢనమ్మకంతో ఆరు నెలల చిన్నారిని human sacrifice ఇచ్చిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే… జిల్లాలోని సేతుపావసత్రం ప్రాంతానికి చెందిన నజ్రుద్దీన్ (32) అనే మత్స్యకారుడికి భార్య షాలికా (30), ఇద్దరు కుమారులు, షాజరా అనే ఆర్నెల్ల కుమార్తె ఉంది.
అయితే, రెండు రోజుల క్రితం ఈ చిన్నారి ఇంటిముందు Water tankలో విగతజీవిగా కనిపించింది. ఆ తర్వాత ఆ చిన్నారికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే,
Six monthsToddler నీటితోట్టిలో ఎలా పడింది? అన్న సందేహం ఇరుగుపొరుగు వారికి వచ్చింది. ఈ విషయం పేరావూరణి పోలీసులకు చేరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నజ్రుద్దీన్, షాలికా దంపతులను విచారించగా అసలు విషయం వెల్లడైంది,
నజ్రుద్దీన్ పిన్ని షర్మిల బేగం (48) భర్త అజారుద్దీన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో మంత్రగాడిని సంప్రదించగా నరబలి ఇస్తే అంతా చక్కబడుతుందని సలహా ఇచ్చాడు. దీంతో Shalika ఆరు నెలల కుమార్తెను షర్మిల బేగం నీటి తొట్టెలో పడేసి చంపేసినట్లు విచారణలో వెల్లడైంది. అలాగే సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించినందుకు నజ్రుద్దీన్, ఆయన సోదరుడు సయ్యద్ ఇబ్రహీం, షర్మిల బేగం ల ను అదుపులోకి తీసుకున్నారు.
బొడ్డుతాడు తింటే పిల్లలు పుడతారని మూఢనమ్మకం.. వివాహిత మృతి..
ఇదిలా ఉండగా, పిల్లలకోసం ఓ మూఢనమ్మకాన్ని గుడ్డిగా ఫాలో అయిన వివాహిత మృత్యువాత పడిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. superstitiousతో బంధువులు ఓ married woman ప్రాణం తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన రవి, సన్నితకు రెండేళ్ల క్రితం marriage అయ్యింది. అయితే వారికి రెండేళ్లుగా children లేకపోవడంతో బంధువులు పదే పదే పిల్లల కోసం సతాయించేవారు. తమకు తెలిసిన ఏవేవో చిట్కాలు చెప్పేవారు.
ఇదే క్రమంలో పిల్లలు కావాలంటే బొడ్డు తాడు తినాలంటూ బంధువులు సలహా ఇచ్చారు. అంతేకాదు రెండు రోజుల క్రితం బలవంతంగా బంధువులు సన్నితతో బొడ్డుతాడు తినిపించారు. ఆ తరువాత సన్నిత అనారోగ్యం ఆస్పత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే బంధువులు బొడ్డుతాడు తినిపించడం వల్లే తన కూతురు చనిపోయిందంటూ మృతురాలి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కాగా, భీమిలీ కొమ్మాదిలో ఇలాంటి మూఢనమ్మకం ఘటనే మరోకటి శుక్రవారం చోటు చేసుకుంది. పెళ్లయిన 42 రోజులకే నవ వధువు మృత్యుఒడికి చేరుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కిరాతకంగా చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ నాలుగో వార్డు పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయ్యమ్మ (26)కు 42 రోజుల కిందట marriage జరిగింది.
అయితే ఏమైందో తెలియదు.. కానీ నరసయమ్మ శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఆమెది హత్యగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాళ్లకు తాడు కట్టి ఛాతిపై వాతలు పెట్టి, మెడకు తాడు కట్టి హత్య చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. హరికి superstitiousపై ఆసక్తి ఎక్కువ అని, జరిగినది.. జరగబోయేదీ చెబుతాను అంటూ ఏవో మంత్రాలు, తంత్రాలు వంటివి వేస్తాడని స్థానికులు చెబుతున్నారు. అలాగే భార్య విషయంలోనూ అతను ఏదో మూఢనమ్మకం ఉండి ఉంటుందని.. ఆ మూఢనమ్మకాలలో భాగంగానే నరసయ్యమ్మను చిత్రహింసలకు గురిచేసి చంపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
