బొడ్డుతాడు తింటే పిల్లలు పుడతారని మూఢనమ్మకం.. వివాహిత మృతి..
పిల్లలు కావాలంటే బొడ్డు తాడు తినాలంటూ బంధువులు సలహా ఇచ్చారు. అంతేకాదు రెండు రోజుల క్రితం బలవంతంగా బంధువులు సన్నితతో బొడ్డుతాడు తినిపించారు కూడా. ఆ తరువాత సన్నిత అస్వస్థతకు గురైంది. అనారోగ్యం ఆస్పత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ సన్నిత మృతి చెందింది.
గుంటూరు : superstitiousతో బంధువులు ఓ married woman ప్రాణం తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన రవి, సన్నితకు రెండేళ్ల క్రితం marriage అయ్యింది. అయితే వారికి రెండేళ్లుగా children లేకపోవడంతో బంధువులు పదే పదే పిల్లల కోసం సతాయించేవారు. తమకు తెలిసిన ఏవేవో చిట్కాలు చెప్పేవారు.
ఇదే క్రమంలో పిల్లలు కావాలంటే బొడ్డు తాడు తినాలంటూ బంధువులు సలహా ఇచ్చారు. అంతేకాదు రెండు రోజుల క్రితం బలవంతంగా బంధువులు సన్నితతో బొడ్డుతాడు తినిపించారు కూడా. ఆ తరువాత సన్నిత అస్వస్థతకు గురైంది. అనారోగ్యం ఆస్పత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ సన్నిత మృతి చెందింది. అయితే బంధువులు బొడ్డుతాడు తినిపించడం వల్లే తన కూతురు చనిపోయిందంటూ మృతురాలి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, భీమిలీ కొమ్మాదిలో ఇలాంటి మూఢనమ్మకం ఘటనే మరోటి చోటు చేసుకుంది. పెళ్లయిన 42 రోజులకే నవ వధువు మృత్యుఒడికి చేరుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కిరాతకంగా చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ నాలుగో వార్డు పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయ్యమ్మ (26)కు 42 రోజుల కిందట marriage జరిగింది. పెళ్లైన వారం రోజులకే హరి అదే వార్డు పరిధి చేపలుప్పాడ సమీపంలోని గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. నగరంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే ఏమైందో తెలియదు.. కానీ నరసయమ్మ శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. తగరపువలసలో ఉంటున్న తన అన్నయ్య కోనాడ అప్పారావుతో ఆమె రోజు ఫోన్ లో మాట్లాడుతుండేది. శుక్రవారం ఉదయం నుంచి అప్పారావు ఆమెకు ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి.. అతను మధ్యాహ్నం నరసయమ్మ ఇంటికి వచ్చేసరికి తన చెల్లి విగతజీవిగా పడి ఉంది. దీంతో హరిని నిలదీయగా ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నరసయమ్మ శుక్రవారం ఉదయమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఆమెది హత్యగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాళ్లకు తాడు కట్టి ఛాతిపై వాతలు పెట్టి, మెడకు తాడు కట్టి హత్య చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. సీఐ వెంకటరమణ, ఎస్సై రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హరికి superstitiousపై ఆసక్తి ఎక్కువ అని, జరిగినది.. జరగబోయేదీ చెబుతాను అంటూ ఏవో మంత్రాలు, తంత్రాలు వంటివి వేస్తాడని స్థానికులు చెబుతున్నారు. ఆ మూఢనమ్మకాలలో భాగంగానే నరసయ్యమ్మను చిత్రహింసలకు గురిచేసి చంపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆమె మరణం విని తండ్రి దుర్గయ్య విలపించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది. దుర్గయ్యకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. కాగా నరసయమ్మ చివరి కుమార్తె. ఆయన భార్య గతంలోనే చనిపోయింది. పెళ్లై ఆనందంగా ఉందని భావించిన తన కూతురు ఇలా హత్యకు గురవుతుందని ఊహించలేదని దుర్గయ్య వాపోయాడు.