ఒక ఐటెన్‌ కారు.. గదగ్‌ సమీపంలో ముండ్రిగి రింగ్‌ రోడ్డులో వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతే వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న పెళ్లివారితో కూడిన ఐ20 కారును ఢీకొట్టింది. 


పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగి.. ఆరుగురు కన్నుమూసిన సంగటన బళ్లారి సమీపంలోని గదగ్‌ జిల్లా ముండ్రిగి రింగ్‌రోడ్డులో చోటుచేసుకుంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధార్వాడ జిల్లా హుబ్లి సమీపంలోని అగసి గ్రామానికి చెందిన ఆనంద్‌ బట్టగేరి, సిద్ధు కోరిశెట్టి, మనోజ్‌కుమార్, అమృత్, చన్నువాడద్, వినయ్‌కౌడి అనే యువకులు మృతి చెందారు.

ఒక ఐటెన్‌ కారు.. గదగ్‌ సమీపంలో ముండ్రిగి రింగ్‌ రోడ్డులో వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతే వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న పెళ్లివారితో కూడిన ఐ20 కారును ఢీకొట్టింది. ఆ తాకిడికి ఐ20 కారు నుజ్జునుజ్జయింది, అందులో ప్రయాణిస్తున్న 6 మంది ఘటనాస్థలంలోనే మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలు తగిలాయి. ఒకరు చేసిన తప్పునకు మరో కారులో ప్రయాణిస్తున్నవారు మృత్యువాత పడటం గమనార్హం. 

ఈ ఘటనపై గదగ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి సంబరాలు ముగించుకుని స్వగృహానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. మృతదేహాలను, క్షతగాత్రులను గదగ్‌ ఆస్పత్రికి తరలించారు.