Asianet News TeluguAsianet News Telugu

కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి!.. అసలేం జరిగిందంటే..?

హర్యానాలోని యమునానగర్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఆరుగురు వ్యక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత రెండు రోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి.

Six dead after consuming spurious liquor in Haryana Yamunanagar district ksm
Author
First Published Nov 9, 2023, 1:52 PM IST

హర్యానాలోని యమునానగర్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఆరుగురు వ్యక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత రెండు రోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని.. వారి మరణాలకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. వివరాలు.. యమునానగర్ జిల్లాలోని రెండు గ్రామాలకు చెందిన కొందరు మద్యం సేవించి వాంతులు చేసుకున్నట్లు సమాచారం. వారు కల్తీ మద్యం సేవించిన తర్వాత ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

అయితే కల్తీ మద్యం తాగిన తర్వాత కొంతసేపటి తర్వాత వారిలో ఐదుగురు చనిపోయారు. మరో ముగ్గురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. ఒకరు మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి మరణం గురించి ఆసుపత్రి నుంచి సమాచారం అందిందని.. ఇది అనుమానాస్పద మద్యం మరణానికి సంబంధించిన కేసుగా పేర్కొనబడిందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు ఉన్న సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సమీప గ్రామాల్లో ఈ విషయం గురించి ఆరా తీశారు.

అయితే కల్తీ మద్యంతో ఇప్పటికే మృతిచెందిన సురేష్ కుమార్, సోను, సురీందర్ పాల్, స్వరణ్ సింగ్, మెహర్ చంద్‌లను కుటుంబ సభ్యులు పోస్టుమార్టం చేయకుండానే వారి మృతదేహాలను దహనం చేశారు. అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహాలకు పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించలేమని పోలీసులు తెలిపారు. మృతులు అనుమానాస్పద హూచ్‌ను ఎక్కడి నుండి పొందాడనే వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. మృతిచెందిన ఆరుగురు కూడా మంగళవారం రాత్రి కల్తీ మద్యం సేవించి ఉంటారని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios