Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. సొంత చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. అర్థరాత్రి పడుకుంటే దగ్గరికి వచ్చి..

అక్కాచెల్లెళ్ల బంధానికే మాయని మచ్చలాంటి పనికి పూనుకుందో యువతి. సొంత చెల్లెలి మీద లైంగిక వేధింపులు పాల్పడింది. దీంతో ఆ చెల్లెలు పోలీసులను ఆశ్రయించింది. 

Sister sexually assaulted by elder sister In maharashtra - bsb
Author
First Published Jan 28, 2023, 8:05 AM IST

మహారాష్ట్ర : సొంత అక్కే చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఓ యువతి సొంత అక్క తనమీద లైంగిక వేధింపులకు పాల్పడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ అక్క చెల్లెలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అక్కకు 24 సంవత్సరాలు,  చెల్లెలికి 18యేళ్లు.

అక్క ఉన్నత విద్యావంతురాలు. పెళ్లి కూడా అయింది. ఇటీవల కొంతకాలంగా చెల్లెలు అక్క దగ్గరికి వచ్చి ఉంటుంది. పూణె జిల్లాలోని విమానగర్ ప్రాంతంలో వీరు ఉంటారు. ఈనెల 23న అక్క ఇంట్లోనే హాలులో చెల్లి నిద్రపోతోంది. ఆ సమయంలో చెల్లి దగ్గరికి వచ్చిన అక్క లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది.  అది తప్పు అని చెల్లి ఎంత వారిస్తున్నా అక్క వినలేదు. అక్కని ఎలా వారించాలో తెలియని చెల్లి..  పోలీస్ స్టేషన్కు వెళ్లింది.  ఈ మేరకు అక్కపై ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉండగా, డిసెంబర్ లో ఇలాంటి లైంగిక వేధింపుల ఘటనే ఛత్తీస్ గఢ్ లో వెలుగు చూసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరుడు డిసెంబర్ మొదట్లో ఓ విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఛత్తీస్ గఢ్, రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు రావడంతో.. సదరు ప్రొఫెసర్ మీద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు.. మధ్యప్రదేశ్‌లో విషాదం

నిందితుడు కుషాభౌ ఠాక్రే యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌ లో పనిచేస్తున్నాడు. మహిళా పోలీస్ ఠాణా అధికారి తెలిపిన వివరాల ప్రకారం క్యాంపస్‌లోనే వేధింపుల ఘటన జరిగిందని సమాచారం. ఫిర్యాదు అందిన వెంటనే సదరు ప్రొఫెసర్ మీద భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354 (మహిళ నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి లేదా నేరపూరిత బలవంతం) కింద అభియోగాలు మోపారు. దీనిమీద దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు.

కాగా, డిసెంబర్ 3న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓ విద్యార్థినిపై హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో యూనివర్సిటీలో తీవ్ర కలకలం చెలరేగింది. విదేశీ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన రవిరంజన్‌పై యూనివర్సిటీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ప్రొఫెసర్ రవిరంజన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. 

బాధిత విద్యార్థిని ప్రొఫెసర్ రవిరంజన్‌ హిందీ నేర్పిస్తాననే సాకుతో తన మీద అత్యాచారయత్నం చేశాడని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కీచక ప్రొఫెసర్ రవిరంజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్  చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ గేటు ఎదుట ఆందోనకు దిగారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios