Asianet News TeluguAsianet News Telugu

‘ఇక నుంచి నువ్వు నా భార్యవు’.. తోటి విద్యార్థినిని బెదిరించి, తాళికట్టి.. అత్యాచారం...

ఓ యువకుడు తనతో చదువుకున్న అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు. వెంటపడి, వేధించి.. బలవంతంగా తాళి కట్టాడు. ఆ తరువాత భార్యవంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. 

youth forced marriage his fellow student and raped her in anantapur
Author
First Published Nov 12, 2022, 9:34 AM IST

అనంతపురం : స్కూల్లో తనతోపాటు చదువుకున్న విద్యార్థినిని.. రెండేళ్ల తర్వాత ప్రేమ పేరుతో వేధించి.. ఆమెను భయపెట్టి తాళి కట్టి.. పలుమార్లు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఈ ఘాతుకం అనంతపురం నగరంలో తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన తన క్లాస్మేట్ అయిన ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి ప్రేమించకపోతే తల్లిని, చెల్లిని చంపుతానని బెదిరించేవాడు. భయపడిన ఆమె అతనితో మాట్లాడేది. 

దీన్ని అదునుగా తీసుకుని ఈ ఏడాది జూన్లో అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశించాడు. బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు. ‘ఇక నుంచి  నువ్వు నా భార్యవు’ అంటూ బ్లాక్ మెయిల్ చేసి,  అత్యాచారానికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన విద్యార్థిని ఇంట్లో ఉన్నప్పుడు తాళి దాచి పెట్టుకుని ఉండేది. కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న ఆమె ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అప్పుడు కూడా ఆమెను అతను వదల్లేదు. సెలవుల తర్వాత కళాశాల విద్యార్థిని వెంటపడి అక్కడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది భరించలేని బాధితురాలు ఇటీవల తల్లికి విషయం చేసింది. దీంతో ఆమె అనంతపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

ఏపీలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో భార్యకు జీవిత ఖైదు.. పెళ్లైన వారానికే ఘాతుకం

ఇదిలా ఉండగా, అక్టోబర్ 1న పాట్నాలో ఇలాంటి షాకింగ్ ఘటనే వెలుగు చూసింది. బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధుబని జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆ బాలికను విక్రయించారు. ఈ కేసులో ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఆ తరువాత ఓ మహిళా పింప్‌కు రూ.50,000లకు అమ్మేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌజిల్లాకు చెందిన బృందం సోనీదేవి అనే మహిళా పింప్ చెర నుంచి బాలికను రక్షించి కేసును చేధించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అరెస్టయిన వారిని జైనగర్‌లోని అశోక్ మార్కెట్‌లో నైట్‌గార్డు సోనీ దేవి, అర్జున్ యాదవ్, ఎలక్ట్రీషియన్ సాజన్ కుమార్‌గా గుర్తించారు. జైనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆచార్య..పోలీసు డ్రైవర్, రామ్‌జీవన్ పాశ్వాన్ అనే చోకీదార్ పరారీలో ఉన్నారు. బాధితురాలు నెల రోజుల క్రితం తన సొంత ఊరు మౌ నుండి దారితప్పి మధుబని జిల్లా జైనగర్ పట్టణానికి చేరుకుంది. అశోక్ మార్కెట్‌లో ఒంటరిగా తిరుగుతుంటే ఆమెను అర్జున్ యాదవ్ గమనించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. తన ముగ్గురు స్నేహితులను పిలిపించి, నలుగురూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఒక గదిలో బందీగా ఉంచారు.

ఆమె మీద పదేపదే అత్యాచారానికి పాల్పడడమే కాకుండా తమకు తెలిసిన వారిని కూడా పిలిచి ఆమె మీద అత్యాచారం చేయించారు. కాగా, బాధితురాలు ఇంట్లో కనిపించకపోవడంతో మౌలోని పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మౌ పోలీసుల బృందం మధుబని జైనగర్ పట్టణానికి చేరుకుంది. అనుమానంతో సోనీ దేవి ఇంటిపై దాడి చేసింది. అక్కడ ఆ బాలిక  ప్రాణాలతో బయటపడింది. పోలీసులు వెంటనే ఆమెను రక్షించి, మహిళను అదుపులోకి తీసుకున్నారు. 

ఘటనను ధృవీకరిస్తూ జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు జైనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సంజయ్ కుమార్ తెలిపారు. ఇతర నిందితులను అరెస్టు చేసేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది. జైనగర్ ఎస్‌డిపిఓ మాట్లాడుతూ, "మావు పోలీసులు మహిళా పింప్ ఇంటిపై దాడి చేశారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణలో కొంతమంది నిందితుల పేర్లు మా వద్ద ఉన్నాయి" ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయని, త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios