Asianet News TeluguAsianet News Telugu

సిసోడియా ను ప‌ద‌వి నుంచి తొల‌గించాలి - బీజేపీ.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కోరుతూ సంతకాల సేక‌ర‌ణ ప్రారంభం

ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాను పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీని కోసం ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణను మంగళవారం ప్రారంభించింది. 

Sisodia should be removed from the post - BJP.. The collection of signatures for public support has begun
Author
First Published Sep 6, 2022, 2:15 PM IST

మద్యం పాల‌సీ కుంభకోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆప్ ప్రభుత్వం నుంచి తొలగించాని బీజేపీ డిమాండ్ చేసింది. దీనికి ప్రజల మద్దతు కోరుతూ ఆ రాష్ట్ర బీజేపీ నాయ‌కులు మంగ‌ళ‌వారం సంతకాల సేక‌రణ కార్య‌క్ర‌మం ప్రారంభించారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భార‌త్

దేశ రాజధానిలోని దాదాపు 20 మెట్రో స్టేషన్లు, ఇతర ప్రముఖ ప్రదేశాల బ‌య‌ట ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, ఎంపీలు మనోజ్ తివారీ, రమేష్ బిధూరితో పార్టీ అనేక మంది ముఖ్య నాయ‌కులు పాల్గొన్నారు. 

‘‘ బీజేపీ నిన్న విడుదల చేసిన స్టింగ్ వీడియో కేజ్రీవాల్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలోని స్కామ్‌ను స్పష్టంగా వెల్లడిస్తోంది. సిసోడియాను తొలగించాలనే మా డిమాండ్‌కు మేము ప్రజల మద్దతును కోరుతున్నాము, ఎందుకంటే స్కామ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆప్ నాయకత్వం ఇప్పటివరకు తప్పించుకుంది ’’ అని కరోల్‌బాగ్ మెట్రో స్టేష‌న్ బ‌య‌ట ఆదేశ్ గుప్తా పేర్కొన్నారు.

చనిపోయిన బాలుడి మృతదేహాన్ని ఉప్పు పాతరేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే!!

కాగా.. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నేత‌లు నేడు ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా నివాసం ఎదుట నిర‌స‌న‌కు దిగనున్నారు. మ‌నీష్ సిసోడియాపై గ‌త నెల నుంచి ఈ మ‌ద్యం పాల‌సీ స్కామ్ లో నింద‌లు ఎదుర్కొంటున్నారు. ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వితో పాటు ఎక్సైజ్ మినిస్ట‌ర్ పోర్ట్ పోలియో కూడా ఉంది. అయితే ఎక్సైజ్ పాలసీ 2021-22లో జరిగిన అవకతవకల్లో ఆయ‌న ప్ర‌మేయం ఉంద‌ని ఒక్క సారిగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీటిపై ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతోంది. 

స్నేహంతో ఎలాంటి స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించుకోవ‌చ్చు - బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా

ఈ ఆరోప‌ణ‌లు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిస్తోంది. త‌మ పార్టీ గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోంద‌నే కార‌ణంతోనే సిసోడియాను బీజేపీ ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. గ‌తంలో కూడా సిసోడియాపై సీబీఐ అభియోగాలు మోపింద‌ని, కానీ ఆయ‌న నిర‌ప‌రాదిగా బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని తెలిపారు. ఇప్పుడు కూడా ఆయ‌న క్లీన్ చీట్ తో బ‌య‌ట‌ప‌డ‌తార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.  కాగా.. మ‌నీస్ సిసోడియా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో, ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2 గా ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios